దేశరాజధానిలో నడిరోడ్డుపై ట్రాఫిక్ మూలంగా కిక్కిరిసిపోయిన వాహనాల మధ్య ఇరుక్కుపోయిన ఓ కారును టార్గెట్ చేస్తూ ముగ్గురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఇద్దరు దుండగులైతే ఆ కారును టార్గెట్ చేసుకుంటూ ముందుకు కదులుతూ కాల్పులు జరిపారు. 

న్యూఢిల్లీ: దేశరాజధాని నడిబొడ్డులో గ్యాంగ్ వార్ బద్ధలైంది. నడిరోడ్డుపై పీక్ ట్రాఫిక్ జామ్‌లో దుండగులు గన్‌లు పట్టుకుని వీరంగం సృష్టించారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఓ కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు పది నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇద్దరు గూండాలు గన్‌ లోడ్ చేసుకుని కారు వైపు నడుచుకుంటూ షూట్ చేశారు. అనంతరం ఒక అడుగు వెనక్కేసి మళ్లీ గన్ లోడ్ చేసుకుని కాల్పులు జరిపారు. ఈ హఠాత్పరిణామంతో బాటసారులు, ఇతర వాహనచోదకులు బెంబేలెత్తిపోయారు. ఈ
రిక్షాలు, కార్లు, ఇతరులు సేఫ్టీ కోసం పరుగులు తీశారు. దీంతో దుండగులు టార్గెట్ చేసిన కారుకు కొంత వెసులుబాటు దొరికింది. వెంటనే వేగంగా కొంత ముందుకు దూసుకెళ్లింది. మళ్లీ రివర్స్‌లో వచ్చి వెనక్కి కారు మరల్చుకుని వెళ్లిపోయింది. ఆ కారు వెంటే గన్‌లు పట్టుకుని ముగ్గురు దుండగులు పరుగులు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమరాలకు చిక్కింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం, కేశోపూర్ మండి మాజీ చైర్మన్ అజయ్ చౌదరి, ఆయన సోదరుడు జస్సా చౌదరిలను ఆ గ్రూప్ సభ్యులు టార్గెట్ చేసుకున్నారు. వారు తిహార్ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ బంధువును పరామర్శించడానికి వారు సుభాష్ నగర్ వైపు వచ్చారు. అప్పటికే తీవ్రంగా ట్రాఫిక్ ఉన్న సమయంలో వారు సరిగ్గా సుభాష్ నగర్ చౌరస్తాకు రాగానే ముగ్గురు దుండగులు వారిపై ఫైరింగ్ జరిపారు. వారు తెల్లటి కారులో ఉన్నారు. ఆ కారును టార్గెట్ చేసుకుని ఇద్దరు దుండగులైతే దానిని సమీపిస్తూ కాల్పులు జరిపారు. కానీ, ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ కారు ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకుంది. కారు రాక ముందే ఆ దుండగులు అక్కడ వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టు తెలుస్తున్నది.

కానీ, ఆ కాల్పులు బీభత్సంతో రోడ్డుపై నుంచి బాటసారులు, ఇతర వాహన చోదకులు వెంటనే పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ కారు ముందు వాహనాలు, వెనక వాహనాలు దాదాపుగా దూరంగా వెళ్లిపోయాయి. దీంతో దుండగులు టార్గెట్ చేసిన కారు వేగంగా ముందుకు మూవ్ అయింది. సీసీటీవీ ఫ్రేమ్ దాటిపోయింది. మళ్లీ అంతే వేగంగా వెనక్కి వచ్చింది. కాల్పులు జరిపిన చోటే కారును వెనక్కి తింపారు. వేగంగా ఆ ట్రాఫిక్ మధ్యలో నుంచే ముందుకు సాగింది.

Scroll to load tweet…

ఆ ఇద్దరు చౌదరి సోదరులు ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చౌదరి బంధువులు హాస్పిటల్ చేరుకున్నారు.

ఈ కాల్పుల వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కానీ, ఇది గ్యాంగ్‌ల మధ్య ఘర్షణగా అనుమానిస్తున్నారు. అజయ్ చౌదరితో ఉన్న వ్యక్తిగత ప్రతీకారంతో ప్రస్తుతం జైలులో ఉన్న సల్మాన్ త్యాగీ అనుచరులే ఆయనపై కాల్పులు జరిపి ఉండొచ్చని వాదనలు జరుగుతున్నాయి. చోరీ సహా అన్ని కోణాల్లో తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటన వెంటనే పోలీసులు పెద్ద మొత్తంలో స్పాట్‌లో మోహరించారు. ఆ స్పాట్‌లో అనేక బుల్లెట్ కేసింగ్స్‌ను రికవరీ చేసుకున్నారు.