Asianet News TeluguAsianet News Telugu

చెడ్డభాష అంటూ కించపరిచి.. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన గూగుల్ !

భారత్ లో అత్యంత చెడ్డ భాష ఏంటి అని గూగుల్ లో టైప్ చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపిస్తోంది. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డ భాషగా చూపించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

google apologises for kannada being search result for ugliest language in india - bsb
Author
Hyderabad, First Published Jun 4, 2021, 11:51 AM IST

భారత్ లో అత్యంత చెడ్డ భాష ఏంటి అని గూగుల్ లో టైప్ చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపిస్తోంది. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డ భాషగా చూపించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిమీద న్యాయపోరాటం చేస్తామని కర్నాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబావళి పేర్కొన్నారు. సెర్చ్ ఇంజన్ గూగుల్ కు నోటీసులు జారీ చేస్తామని కన్నడ అధికారులు చెబుతున్నారు. 

సామాన్యుల నుంచి కన్నడ స్టార్స్ వరకు గూగుల్ తప్పిదం మీద మండిపడుతున్నారు. వెంటనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన పొరపాటును గుర్తించిన గూగుల్ వెంటనే క్షమాపణలు చెప్పింది. 

ఇది కావాలని చేపింది కాదనీ, సెర్చ్ ఇంజన్ పొరపాటుగా గుర్తించాలని కన్నడ భాషలోనే గూగుల్ ట్వీట్ చేసింది. అయితే ఈ వివాదానికి ఇక్కడితో తెరపడుతుందో లేదో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios