ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ సంచలనాత్మక నిర్ణయానికి తెరతీసింది. తమ సంస్థల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజుల పెయిడ్ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది. వివరాల్లోకి వెడితే..
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ సంచలనాత్మక నిర్ణయానికి తెరతీసింది. తమ సంస్థల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజుల పెయిడ్ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది. వివరాల్లోకి వెడితే..
అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్ సంస్థల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు లీవ్ ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు వారికి 22 ఏళ్ళు వయస్సు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.
దీంతో ఇంటివద్ద ఇంటి వద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవాలన్నా, ఆసుపత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లో వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు.
వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికి కొందరి ఇళ్ళల్లో కుటుంబసభ్యులు, ఇతరులు ఎవరూ ఉండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవలసి వస్తోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సెలవు పెట్టి ఇంటివద్ద ఉండడం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందే వరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు సెలవులు అవకాశం కల్పించినట్లు బెస్ట్ అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు.
అయితే ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు తమ కుమారుడు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది. అంతేకాదు వికలాంగ పిల్లలు తమపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది.
