Asianet News TeluguAsianet News Telugu

త్రిపురలో రక్తపాతం చూసిన‌ రోజులు తిరిగి రానివ్వొద్దు: ఓటర్లతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Agartala: త్రిపురలో రక్తపాతం చూసిన‌ రోజులు తిరిగి రానివ్వొద్దని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శర్మ ఓట‌ర్ల‌తో అన్నారు. గోమతి జిల్లాలోని కిల్లా ప్రాంతంలో సోమవారం జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, అధికార బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం త్రిపురలో అభివృద్ధి వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉందన్నారు.
 

Gomati : Don't let the days of seeing bloodshed in Tripura come back: Assam CM Himanta Biswa Sarma to voters
Author
First Published Jan 10, 2023, 2:40 PM IST

Assam Chief Minister Himanta Biswa Sharma: త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాని పార్టీలు ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌తో పాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త్రిపురలో రక్తపాతం చూసిన‌ రోజులు తిరిగి రానివ్వొద్దని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శర్మ ఓట‌ర్ల‌తో అన్నారు. గోమతి జిల్లాలోని కిల్లా ప్రాంతంలో సోమవారం జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, అధికార బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం త్రిపురలో అభివృద్ధి వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉందన్నారు.

త్రిపురలో బీజేపీ నాయకత్వంలో శాంతి నెలకొంటోందనీ, ఈశాన్య రాష్ట్రంలో రక్తపాతం రోజులు తిరిగి రానివ్వవద్దని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోమతి జిల్లాలోని కిల్లా ప్రాంతంలో సోమవారం జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, అధికార బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం త్రిపురలో అభివృద్ధి వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉందన్నారు. మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో ముందుకు సాగ‌డానికి బీజేపీకి మ‌రోసారి ప‌ట్టం క‌ట్టాల‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. త్రిపుర గతంలో హత్యలు, నేరాలు, మానభంగాలకు ప్రసిద్ధి చెందిందని, కానీ ఇప్పుడు శాంతి నెలకొంటోందని అన్నారు. రక్తపాతం జరిగిన ఆ రోజులు రాష్ట్రానికి తిరిగి రానివ్వవద్దుని ఆయ‌న ఓట‌ర్ల‌తో అన్నారు. బీజేపీ పాలనలో త్రిపుర భారీ వృద్ధిని నమోదు చేసిందనీ, కోవిడ్ -19 మహమ్మారి దాడి చేయకపోతే ఈశాన్య రాష్ట్రం 120 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి చెంది ఉండేదని నెడా (నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్) కన్వీనర్ అన్నారు.

ప్రస్తుతం త్రిపుర అభివృద్ధి వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉందనీ, కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ  ప్రభుత్వం, రాష్ట్రంలోని మాణిక్ సాహా ప్రభుత్వం సూప‌ర్ వేగంతో అభివృద్ధిలో ప్రయాణిస్తోందని చెప్పారు. "కొవిడ్-19 మహమ్మారి వచ్చి రెండేళ్లు ఉండకపోతే అభివృద్ధి వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉండేది. ఈ ఐదేళ్లలో లెఫ్ట్ ఫ్రంట్ సాధించలేని పనిని బీజేపీ కేవలం ఐదేళ్లలో చేసింద‌ని" ఆయ‌న అన్నారు. బీజేపీని మరో ఐదేళ్ల పాటు ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన శర్మ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి వాహనం వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో నేషనల్ లా యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ల ఏర్పాటుతో పాటు కొత్తగా 10 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి మాణిక్ సాహా, అప్పటి ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ ప్రభుత్వాల విజయాలలో కొన్ని అని హిమంత బిశ్వ‌ శర్మ పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డీఏ ఇవ్వగా, సామాజిక పింఛనును రూ.2 వేలకు పెంచామని చెప్పారు.

కాగా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం మాట్లాడుతూ బీజేపీ గంగా నది లాంటిదనీ, వారి పాపాలను వదిలించుకోవడానికి వామపక్ష నాయకులు అందులో చేరాలని కోరారు. “ఈ రోజు నేను స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను ఇప్పటికీ నమ్ముతున్న వారిని బీజేపీలో చేరమని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది గంగా నది లాంటిది. మీరు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి” అని బీజేపీ జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సాహా కరాబన్‌లో అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios