దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారుల నిఘా ఎక్కువ కావడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ బంగారం బిస్కెట్లను బ్రాలో పెట్టుకుని వచ్చి... తనిఖీల్లో అడ్డంగా దొరికింది.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన క్రైసోర్న్ థాంప్రకోప్ అనే మహిళ రూ. 47 లక్షల బంగారం బిస్కెట్లను బ్రాలో పెట్టుకుని టీజీ 337 నెంబర్ విమానంలో చెన్నైకి చేరుకుంది. ఆమెపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి అసలు విషయాన్ని కనుగొన్నారు.

దీంతో థాంప్రకోప్‌ను అధికారులు అరెస్ట్ చేసి, బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పద్మావతి అనే మరో ప్రయాణికురాలు రూ.12 లక్షల విలువ చేసే 365 గ్రాముల బంగారాన్ని కువైట్ నుంచి డ్రాయరు లోపల దాచుకుని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.