న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో  మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు ఇద్దరు దొంగలు. సీసీటీవీ పుటేజీలో  ఇద్దరు దొంగల దృశ్యాలను పోలీసులు  గుర్తించారు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని  చిత్రం బస్టాండ్ సమీపంలోని లలిత జ్యూయలరీ షాపులో రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.
ఈ షాపు వెనుక వైపు ఉన్న గోడను తవ్వి ఇద్దరు దొంగలు జ్యూయలరీ షాపులోకి ప్రవేశించారు. దుకాణంలోని రూ. 50 కోట్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 

సంఘటన స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాల కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడ తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో కూడ ఇదే తరహలో చోరీ జరిగింది. వినియోగాదారుల మాదిరిగా వచ్చిన కొందరు నగలను అపహరించుకెళ్లారు.