రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పురాతన బంగారు నాణేలు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఇది ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లోని తమిళనాడు ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.

కృష్ణగిరి జిల్లా హోసూరులో రోడ్డు పక్కన మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బంగారు నాణేల కోసం ఎగబడ్డారు.

కాలినడకన కొందరు, బైకులపై మరికొందరు.. ఇలా వేలాది మంది తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది. హోసూరు - బాగలూరు రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

ఒక్కో బంగారు నాణేం రెండు గ్రాములకు పైబడి వున్నట్లుగా తెలుస్తోంది. వీటిపై అరబిక్ భాషకు చెందిన అక్షరాలు ముద్రించి వున్నాయి. అయితే మట్టిదిబ్బల కిందకు బంగారు నాణేలు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపే బంగారు నాణేలు మాయమయ్యాయి.