చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్‌పోర్టులో సోమవారం నాడు రూ. 1.20 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని ఎయిర్  పోర్టులో ఓ ప్రయాణీకుడి నుండి స్వాధీనం చేసుకొన్నారు. బంగారాన్ని చిన్న ముక్కలుగా చేసి ఆరెంజ్ పౌడర్ లో కలిపి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా  అధికారులు గుర్తించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఇటీవల కాలంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ  పలువురు పట్టుబట్టారు.  చెన్నై ఒక్క ఎయిర్‌పోర్టులోనే కాదు దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో కూడ ఇదే తరహలో ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకొన్నాయి. 

ఇతర దేశాల నుండి అక్రమ మార్గాల్లో ఇండియాకు బంగారాన్ని తరలిస్తూ పలువురు పట్టుబడుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకొనేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కానీ చివరికు అధికారులకు దొరికి జైలు పాలౌతున్నారు. ఇతర దేశాల నుండి తక్కువ ధరకు బంగారాన్ని దేశంలోకి తీసుకురావడానికి  కొందరు అక్రమార్కులు ఇండియాలోకి బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణీకుల ద్వారా ఇతర దేశాల నుండి బంగారాన్ని తరలిస్తున్నారు.