న్యూడిల్లీ: అతని కోసం సిబీఐ అధికారులు ఎడ తెగకుండా గాలిస్తున్నారు. తనను బాబాగా చెప్పుకుంటూ అమ్మాయిలని నిర్బంధించి, చెరపట్టడమే పనిగా పెట్టుకున్ిాడు. దాదాపు 168 మందిని అతను బంధించినట్లు చెబుతున్నారు. అతని ఆచూకీ చెప్పనవారికి రూ. 5 లక్షల బహుమతి ఇస్తామని సిబీఐ తాజాగా ప్రకటించింది. అతని పేరు వీరేంద్ర దేవ్ దీక్షిత్. 

2020లో ప్రపంచం అంతమైపోతుందని, తనను ఆశ్రయించివారిని రక్షిస్తానని నమ్మించి పలువురిని ఆకర్షించాడు. ఆశ్రమాలను విస్తరిస్తూ వెళ్లాడు. చివరకి తనను తాను శ్రీకృష్ణుడి అవతారంగా ప్రకటించుకుని 16 వేల మంది స్త్రీలను చెరపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

దేశవ్యాప్తంగా అతనికి చాలా కేంద్రాలున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలోనే ఐదు కేంద్రాలున్నట్లు చెబుతున్నారు. అతను  ఏ ఆశ్రమానికి వెళ్తే ఆ ఆశ్రమంలో గుప్త ప్రసాదం పేర 8 నుంచి 10 మంది అమ్మాయిలను ఏర్పాటు చేయాలని, ఆ రాత్రి అతనితో గడిపిన అమ్మాయిలను రాణులుగా పిలుస్తారని సమాచారం. 

ఓ యువతి తల్లిదండ్రులు 2017 జూన్ లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వీరేంద్ర దేవ్ అక్రమాలు బయటపడ్డాయి. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటైన ఓ బృందం అతని ఆశ్రమంపై దాడి చేసి 67 మందజి బాలికలకు విముక్తి కలిగించింది. 

తాను బ్రహ్మకుమారి సంస్థ వ్యవస్థాపకులు లేఖ్ రాజ్ కృపలానీ స్ఫూర్తితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వీరేంద్ర దేవ్ దీక్షిత్ తొలినాళ్లలో చెప్పాడు. అయితే, బ్రహ్మకుమారి సంస్థ అతని ప్రచారాన్ని ఖండించింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆధ్యాత్మిక ఐశ్వర్య విశ్వవిద్యాలయ్ ఏర్పాటు చేశాడు. హైకోర్టు ఆదేశాలతో విశ్వ పదాన్ని తొలగించాడు. 

హైకోర్టు ఆదేశాల మేరకు వీరేంద్ర దేవ్ దీక్షిత్ పై ఉన్న కేసులను ఢిల్లీ పోలీసులు సీబీఐకి బదిలీ చేశారు. 2018 జనవరిలో అతనిపై సిబీఐ మూడు ఎఫ్ఐఆర్ లు నమోదుచేసింది. అయితే, అప్పటికే అతను పరారయ్యాడు. అతనిపై రెండు సార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇంటర్ పోల్ బ్లూ నోటీస్ కూడా జారీ చేసింది. 

1998లో వీరేంద్ర ఓసారి అరెస్టయి ఆరు నెలల పాటు జైలులో ఉన్నాడు. వీరేంద్ర దేవ్ పారిపోవడానికి రెండేల్ల ముందు 2015లో తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఓ యువతి అతని ఉచ్చులో చిక్కుకుంది.

పరారీలో ఉన్న వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షలు ఇస్తామని సీబిఐ ప్రకటించింది. 011 -243686 నంబర్ కు ఫోన్ చేసి గానీ 011-24368662 నంబర్ కు ఫ్యాక్స్ ద్వారా గానీ, spstfdel@cbi.gov.in అనే మెయిల్ ద్వారా గానీ తమకు సమాచారం ఇవ్వాలని చెప్పింది.