Asianet News TeluguAsianet News Telugu

మేకల దొంగల ఘాతుకం.. ఛేజింగ్ చేశాడని స్పెషల్ ఎస్సై హత్య..!

భూమినాథన్  చిన్న సూర్యర్ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలు దొంగిలించి తీసుకువెళుతుండడాన్ని గమనించారు. అంతే వెంటనే వానికి Chasing చేశారు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ దొంగలను చిత్రై వేల్ ఛేజింగ్ చేయలేకపోయారు. 

Goat thieves murder special SI for chasing in tamilnadu
Author
Hyderabad, First Published Nov 22, 2021, 10:41 AM IST

చెన్నై : తిరుచ్చిలో Goat thieves వీరంగం సృష్టించారు. తమ సహచరులను ఛేజ్ చేసి.. పట్టుకునేందుకు వచ్చిన Special SIను దారుణంగా హతమార్చారు. ఈ దాడితో నిజాయితీ పరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ ను డిపార్ట్ మెంట్ కోల్పోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన వివరాలు విన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి Ex Gracia ప్రకటించారు. 

తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్ఐగా భూమినాథన్ (51) పనిచేస్తున్నారు. భార్య కవిత (46), కుమారుడు గుహనాథన్ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలయు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ చిత్రై వేల్ తో కలిసి గస్తీలో ఉన్నారు. 

మేకల దొంగల కోసం ఛేజింగ్...
Bhuminathan  చిన్న సూర్యర్ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలు దొంగిలించి తీసుకువెళుతుండడాన్ని గమనించారు. అంతే వెంటనే వానికి Chasing చేశారు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ దొంగలను చిత్రై వేల్ ఛేజింగ్ చేయలేకపోయారు. 

కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు.. చేయి నరికేసి, దాచిపెట్టి.. ఓ యజమాని దారుణం...

భూమినాథన్ వెనకడుగు వేయకుండా తిరుచ్చి జిల్లా నుంచి పుదుకోటై జిల్లాలోకి ప్రవేశించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత స్టేషన్ ఎస్ ఐ కీరనూర్ శేఖర్ కు కాల్ చేసి పుదుకోటై పల్లత్తు పట్టి గ్రామ శివారుకు రావాలని కోరారు. అయితే తమ వాళ్లు భూమినాథన్ కు చిక్కడంతో మిగిలిన ఇద్దరు రెచ్చిపోయారు. కత్తులతో భూమినాథన్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ Attackతో భూమినాథన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కీరనూరు నుంచి శేఖర్ తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

దుండగుల కోసం గాలింపు..
అప్పటికే ఆయన మృతి చెందడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఐజీ శరవణ సుందర్, తిరుచ్చి ఎస్పీ సుజిత్ కుమార్, పుదుకోటై ఎస్పీ నిషా పార్థీబన్ నేతృత్వంలోని బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. Thugs పుదుకోటై జిల్లాకు చెందిన వారై ఉంటారని తేల్చారు. మార్గమధ్యలో ఓ ఇంటి వద్ద ఉన్న CCTV cameraలో ఈ చేజింగ్ దృశ్యాలు వెలుగు చూశాయి. దాని ఆధారంగా ఎనిమిది ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి.

రూ. కోటి ఎక్స్ గ్రేషియా...
ఎస్ఎస్ఐ dead bodyకి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అతని మృతదేహానికి కుటుంబసభ్యులు స్వ గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రూ.కోటి ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ప్రకటన చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios