పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని సావంత్ స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా సావంత్ ఈ విషయాన్ని ప్రకటించారు.

తనకు లక్షణాలు లేకుండానే కరోనా వ్యాప్తి చెందిందని ఆయన తెలిపారు. తాను హోం క్వారంటైన్ లో ఉంటున్నట్టుగా ఆయన చెప్పారు.తాను తన నివాసం నుండే తన విధులను నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు కరోనా పరీక్షలు కూడ చేయించుకోవాలని ఆయన కోరారు.

గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరంతా కూడ కరోనా నుండి కోలుకొన్నారు. తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడ కరోనా బారినపడ్డారు.దేశంలో కరోనా కేసులు బుధవారం నాటికి 37 లక్షల 69 వేలకు చేరాయి.  ఇందులో 29 లక్షల మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో ఇంకా 8 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.