బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే తెలిసిన వారో.. లేదంటే చుట్టుపక్కల వారో మనల్ని మందలిస్తూ ఉంటారు అలాంటిది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందలిస్తే. వివరాల్లోకి వెళితే... గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్నారు.

ఈ సమయంలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి  కంభార్జువా నదిలో చెత్తపారేయటం ముఖ్యమంత్రి గమనించారు. అంతే వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి... నదిలో చెత్తను పారేయవద్దని సదరు వ్యక్తిని మందలించారు.

నదుల్ని కలుషితం చేయొద్దని.. బాధ్యతగల పౌరుడిగా ప్రవర్తించాలని సూచించారు. ఈ తతంగాన్ని సావంత్ తన ట్వీట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనను ప్రశంసించారు.