గోవాలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని  టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేశారు. 

గోవా (goa) రాష్ట్రంలో బీజేపీని ఓడించ‌డ‌మే తృణ‌ముల్ కాంగ్రెస్ (TMC) ల‌క్ష్య‌మ‌ని టీఎంసీ ఎంపీ మహువా (mp mahutha moithra) మొయిత్రా అన్నారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ (bjp) పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌మ చేతుల్లో బీజేపీ ఓట‌మి ఒక మైలు దూరంలో ఉంద‌ని, ఈ స‌మ‌యంలో వెన‌కాడ‌బోమ‌ని అన్నారు.

ఎంపీ మ‌హువా మొయిత్రా కాంగ్రెస్ (congress) పార్టీపై కూడా విమ‌ర్శ‌లు చేశారు. గోవాలో కాషాయ పార్టీని ఓడించ‌డం పాత పార్టీ ఒక్క దాని వల్ల అయ్యే పని కాదని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. అధికార పార్టీని ఓడించాలంటే బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ ఏకం కావాల్సిన అసవరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. గోవాలో 2017 ఎన్నిక‌ల అనంత‌రం కాంగ్రెస్ పరాజ‌యాన్ని ఎంపీ గుర్తు చేశారు. గోవా ఎన్నిక‌ల పోరులో కాంగ్రెస్ ఒంటిరిగా బీజేపీని స‌వాల్ చేసే ప‌రిస్థితిలో లేద‌ని అన్నారు. అలా ఉంటే టీఎంసీ ఇక్క‌డ పోటీ చేయ‌డానికి రాద‌ని అన్నారు. ‘బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య ద్వంద్వ పోరు ఉంటే, టీఎంసీ గోవాకు రావాల్సిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్‌కు క్షీణించిన బలాన్ని గుర్తించి, మేల్కొవాలి. గోవా ప్రజలు ఏమి చేస్తారో కాంగ్రెస్ గమనించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు. 

ఫిబ్రవరి 14న ఎన్నికలు
గోవా శాస‌న‌స‌భకు 2022 ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో 40 మంది స‌భ్యులు ఉన్నారు. వారి ఎన్నిక కోసం వ‌చ్చే మొదటి విడతలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం భావించింది. అయితే దీనికి సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్ ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. గోవాలో ప్రస్తుతం కొన‌సాగుతున్న శాసనసభ పదవీకాలం మార్చి 15, 2022తో ముగియనుంది. గోవాలో ప్ర‌స్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉంది. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ రెండు పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండే అవ‌కాశం ఉంది. ఆ రెండు పార్టీలు ఇత‌ర మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారం పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇక్క‌డ తృణ‌ముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి.

5 రాష్ట్రాల్లో ఏడు విడ‌త‌లుగా ఎన్నిక‌లు.. 
గోవాతో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఇందులో ఉత్తరాఖండ్ (utharakand), పంజాబ్ (punjab), మణిపూర్ (manipur), ఉత్తరప్రదేశ్ (utharapradhesh) రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తర‌ప్ర‌దేశ్‌ శాసనసభ గడువు మే నెలతో, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ శాసనసభల గడువు మార్చి నెలలో వివిధ తేదీల్లో ముగియనున్నాయి. మొత్తంగా యూపీలో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగ‌నున్నాయి. అయితే అసెంబ్లీ స్థానాలు త‌క్కువ‌గా ఉన్న గోవాతో పాటు పంజాబ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడ‌త‌లో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు.