ఈ నెల 29 నుండి  మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఈ నెల 29 నుండి మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.బుధవారం నాడు గోవా సీఎం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29 నుండి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టుగా గోవా సీఎం తెలిపారు. లాక్‌డౌన్ విషయమై ప్రజలు భయపడవద్దని ఆయన కోరారు. కిరాణా దుకాణాలు, అత్యవసర సేవలు పనిచేయడానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. వలస కార్మికులు ఎవరూ కూడ రాష్ట్రం వదిలిపోవద్దని ఆయన కోరారు. 

Scroll to load tweet…

లాక్‌డౌన్ విధించిన రోజుల్లో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు. దీని ద్వారా కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయవద్దని కోరారు. లాక్‌డౌన్ వ్యవధిలో క్యాసినోలు బార్లు మూసివేయనున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఆహారపదార్ధాలను రెస్టారెంట్ల నుండి ఇంటికి నేరుగా సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. నిత్యావసర సరుకుల సరఫరా విషయంలో రాష్ట్రంలో ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవని సీఎం తేల్చి చెప్పారు. ఇప్పటికే గోవాలో అడుగుపెట్టిన టూరిస్టులను లాక్‌డౌన్ సమయంలో బయటకు అడుగుపెట్టొద్దని ఆయన కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ప్రభుత్వం ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. పరిశ్రమలకు లాక్‌డౌన్ ఆంక్షలు వర్తించవని సీఎం తెలిపారు.