కిడ్నాప్ అయిన తన కూతుర్ని వెతకమంటే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనిపించకుండా పోయిన తన కుమార్తెను వెతకడానికి పోలీసు వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారంటూ ఆ తల్లి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యింది. 

కిడ్నాప్ అయిన తన కూతుర్ని వెతకమంటే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఓ కన్నతల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనిపించకుండా పోయిన తన కుమార్తెను వెతకడానికి పోలీసు వాహనాల్లో డీజిల్ పోయించమంటున్నారంటూ ఆ తల్లి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యింది. 

పోలీసుల తీరుపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెడితే.. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ దివ్యాంగురాలు. తన కుమార్తె కిడ్నాప్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే, తన కూతుర్ని వెతికి పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చూపిస్తుండడంతో వారిమీద కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారికి విన్నవించుకుంది. ఈ క్రమంలో కమిషనర్ ఆఫీస్ వద్ద స్థానిక మీడియా ఎదుట ఆమె తన బాధను వెల్లగక్కింది. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మీ కూతుర్ని వెతుకుతున్నాం అంటారు. కొన్నిసార్లు బైటికి గెంటేస్తారు. నా కూతురిమీద నిందలు వేస్తున్నారు.

పోలీస్ వెహికిల్స్ లో డీజిల్ నింపితే నా కూతుర్ని వెతుకుతామంటున్నారు. నేను వారికి లంచం ఇవ్వలేదు. కానీ డీజిల్ నింపించారు. దీనికోసం పది, పదిహేను వేల రూపాయలు అప్పు చేశాను. ఇట్ల ఎంతకాలం? అని ఆ మహిళ వాపోతోంది. తను ఫిర్యాదు చేసిన పీఎస్ లో ఒక్కరు మాత్రమే కాస్త సహకరిస్తున్నారి తెలిపింది. 

ఈ కిడ్నాప్ కు తన బంధువే కారణమని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మీద కాన్పూర్ సీనియర్ పోలీస్ అధికారి బ్రజేష్ కుమార్ శ్రీ వాస్తవ స్పందించారు. ఈ కేసుమీద వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించారు. 

ఆ దివ్యాంగురాలు పోలీసులపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. వారిమీద కఠిన చర్యలు తప్పవని సీనియర్ అధికారులు చెబుతున్నారు.