Asianet News TeluguAsianet News Telugu

సరదా కోసం బాలికలెవరూ శారీరక సంబంధం పెట్టుకోరు: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 బాలికలు సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని  మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి మరో యువతితో పెళ్లికి సిద్దమైన యువకుడి బెయిల్ పిటిషన్ పై వాదన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 
 

girls dont indulge in carnal activities just for fun says MP HC judge
Author
Bhopal, First Published Aug 15, 2021, 3:04 PM IST

భోపాల్: భారతీయ బాలికలు ఎవరూ కూడ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.ఓ యువకుడి బెయిల్ పిటిషన్ పై  జరిగిన విచారణ సమయంలో  హైకోర్టు ఈ వ్యాఖ్మలు చేసింది.

రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన యువకుడు ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  అయితే మరో యువతిని పెళ్లి చేసుకొంటానని యువతికి అతను చెప్పడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. 2018 అక్టోబర్ నుండి అతను ఆమెపై అత్యాచారం చేశాడు. 2020  జూన్ లో ఆమెను పెళ్లి చేసకోవడానికి అతను నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

దీంతో ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఆ యువకుడు ధరఖాస్తు చేశాడు.  ఈ బెయిల్ పిటిషన్ పై  మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయ్ శంకర్ విచారణ చేశారు.

ఆమె సమ్మతితోనే ఆ యువకుడు ఆమెతో సంబంధం పెట్టుకొన్నాడని నిందితుడి తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. 

పెళ్లి చేసుకొంటానని నమ్మకంగా చెబితేనే ఇలాంటి వాటికి భారతీయ బాలికలు  అంగీకరించరని ఆయన చెప్పారు. ఇలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా ఆ తర్వాత జరిగే పర్యవసానాలను కూడ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios