యువకుడి ప్రాణం తీసిన ప్రేమ! పట్టపగలే రోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన యువతి కుటుంబం.. ఢిల్లీలో కలకలం
ఢిల్లీలో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. యువకుడు స్నేహంగా ఉంటున్న యువతి కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేయగా స్పాట్‌లోనే ఆ వ్యక్తి మరణించాడు. జాఫ్రాబాద్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది.

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కలకలం రేగింది. రోడ్డుపై ఇద్దరు మిత్రులతో వెళ్లుతున్న యువకుడిని కొందరు అడ్డుకున్నారు. బైక్ ఆగగానే వారి వెంట తెచ్చుకున్న కత్తులను బయటకు తీసి దాడికి దిగారు. ఇద్దరు మిత్రులు పారిపోయారు. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయగా ఆ యువకుడు అక్కడే స్పాట్‌లోనే మరణించాడు. ఆ యువకుడు సన్నిహితంగా ఉంటున్న యువతి కుటుంబ సభ్యులే ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 ఏళ్ల యువకుడు స్పాట్‌లో రక్తపు మడుగులోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన ఘటన సమీపంలోని ఓ సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.
పోలీసుల వివరాల ప్రకారం 25 ఏళ్ల సల్మాన్ రెండేళ్లుగా ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. వారి స్నేహాన్ని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, వారు మిన్నకుండలేదు. వారి ఫ్రెండ్షిప్‌ను కొనసాగించారు. అది జీర్ణించుకోలేక యువతి కుటుంబం ఆ యువకుడిని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చింది.
Also Read: విపక్షాల కూటమికి కొత్త పేరు ‘INDIA’ .. అర్ధం ఏంటంటే, మరి సారథి ఎవరు.. వివరాలివే..!!
యువతి తండ్రి మంజూర్, సోదరుడు మోసిన్, మరో మైనర్ సోదరుడు సల్మాన్‌పై కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తున్నది.
సీసీటీవీ ప్రకారం, సల్మాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇరుకుగా ఉన్న గల్లీలో వెళ్లుతున్నాడు. వారికి ఎదురుగా కొందరు వ్యక్తులు వచ్చారు. బండిని ఆపేశారు. కత్తులు బయటకు తీసి దాడి చేయడానికి ఉపక్రమిస్తుండగా.. సల్మాన్ స్నేహితులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.