Asianet News TeluguAsianet News Telugu

రూ.30వేల కోసం.. మాజీ లవర్ ను కిడ్నాప్ చేయించిన ప్రియురాలు.. ఎక్కడంటే..

కలకత్తాలో ఓ ప్రియురాలు దారుణానికి తెగించింది. రూ. 30వేల కోసం తన మాజీ లవర్ ను కిడ్నాప్ చేయించింది. అతని తండ్రిని డబ్బులు డిమాండ్ చేసింది. 

Girlfriend kidnapped ex-lover For Rs. 30 thousand in kolkata
Author
First Published Aug 26, 2022, 11:11 AM IST

కోల్ కత్తా : ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో రూ.30బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చిందో అమ్మాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో గతంలో తానిచ్చిన రూ.30 వేలు వసూలు చేసుకోవాలని భావించింది ఆ అమ్మాయి. దీని కోసం ఏకంగా కిడ్నాప్ కు  పాల్పడింది. కలకత్తాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22) కోస్తోపూర్ కు చెందిన అమ్మాయి (18)  గతంలో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు.  

వారిద్దరూ  చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ కి ఆ అమ్మాయి 30 వేల రూపాయలు ఇచ్చింది. అయితే ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె గుర్తించింది. తనను పట్టించుకోవడం మానేశాడు అని అనుమానించింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరిదారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం మరో యువకుడిని ప్రేమిస్తున్న అమ్మాయి మాజీ ప్రియుడు నుంచి 30 వేల రూపాయలు ఎలాగైనా వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ ప్లాన్ వేసింది. కలుసుకుందాం రమ్మని  మాజీ ప్రియుడికి కబురు చేసింది. కబురు అందగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆమె ముందు వాలిపోయాడు ఆ ప్రియుడు. 

రొమాన్స్ స్కామ్స్... డేటింగ్ సైట్లలో హైటెక్ వ్యభిచారం.. వేలమంది బాధితులు, కోట్లలో మోసం...

అప్పటికే తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితులతో కాచుక్కూర్చున్న ఆమె అతనిని కిడ్నాప్ చేసి భవానిపూర్ కి తీసుకువెళ్లింది. అక్కడ లేడీస్ పార్కు సమీపంలో ఓ గదిలో బంధించింది.ఆ తర్వాత మాజీ ప్రియుడి తండ్రి తపన్ (52)కు ఫోన్ చేసింది. డబ్బులు తెచ్చిస్తేనే వదిలి పెడతాం అని తేల్చి చెప్పింది. నిజానికి మొదట లక్షరూపాయలు డిమాండ్ చేసిన యువతి ఆ తర్వాత తన 30000 తనకు ఇస్తే చాలు అంది. దీంతో ఎటూ పాలుపోని తపన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్, అతడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని తమల్ ను రక్షించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios