మూడేళ్లుగా ప్రేమించి, తనను రహస్యంగా పెళ్లి చేసుకుని..మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఓ యువతి ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. 

బీహార్ : బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్నాలో తనను మోసం చేశాడని ప్రియుడి మర్మంగాన్ని కోసేసింది ఓ యువతి. అతను ఆ యువతిని రహస్య వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు ఈ దారుణానికి ఓడిగట్టింది. సదరు బాధితుడు సిఆర్పిఎఫ్ జవాన్. చత్తిస్గఢ్ లో విధుల్లో ఉన్నాడు. అతను గత మూడేళ్లుగా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.

ఇటీవలే ఆమెను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. ఇటు ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జవాను మరోవైపు.. ఈ నెల 23వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం ఆ యువతికి తెలిసింది. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే పట్నాలోని హోటల్ కి రమ్మని ప్రియుడిని పిలిచింది. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో.. అదును చూసి పదునైన ఆయుధంతో ప్రియుడు మర్మాంగాన్ని కోసేసింది.

10 కోట్ల‌కు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు.. నాలుగేళ్లలో 44% పెరుగుద‌ల‌: ఐసీఎంఆర్ స్టడీలో షాకింగ్ విష‌యాలు

వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంది. విషయం పోలీసులకు చేరడంతో ఆమె మీద కేసు నమోదు చేసి.. నిందితురాలని అరెస్టు చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో గతనెలలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని అతి దారుణంగా హతమార్చింది ఓ ప్రియురాలు. అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి కత్తిపీటతో దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలయపాలెంలో చోటుచేసుకుంది. తిరుమలాయపాలెంకి చెందిన ఒమ్మి నాగశేషు (25) తాపీ పని చేస్తుంటాడు. 

కుర్లు డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి నాగశేషుకు పరిచయం ఉంది. డిబేరా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన యువతి. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగ శేషు తన అవసరాల కోసం అప్పుడప్పుడు డిబేరా నుంచి దాదాపు రూ.2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వీటిని ఆమె కొంత నగదు రూపంలోనూ.. మరికొంత బంగారు గొలుసు రూపంలో ఇచ్చింది. 

ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబానికి తెలిసింది. వారికి ఈ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో మరో యువతితో ఏడాది కిందట నాగశేషుకు వివాహం చేశారు. ఈ విషయం డిబేరాకు తెలియదు. ఇటీవలే ఈ విషయం తెలియడంతో నాగశేషును నిలదీసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు, గొలుసు ఇచ్చేసేయాలని తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా నాగశేషు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో డిబేరా అతనిమీద కక్ష పెంచుకుంది. 

తనకు దక్కని నాగశేషును చంపేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం శివన్నారాయణ అనే తన స్నేహితుడు శివన్నారాయణతో కలిసి నాగశేషు ఇంటికి వెళ్ళింది. డాబా మీద పడుకున్న అతని దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి వచ్చిన డిబేరా తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో నాగశేషు మీద దాడి చేసింది. ఈ గొడవకు ఇంట్లోని వారంతా నిద్రలేచారు. 

కొడుకు మీద దాడి చేస్తుండడంతో నాగశేషు తల్లి గంగ అడ్డుకోబోయింది. ఆమె మీద శివన్నారాయణ కర్రతో దాడికి దిగాడు. నాగ శేషు మీద కత్తిపీటతో దాడి చేసిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.