చెన్నై: తల్లితో అక్రమసంబంధాన్ని కలిగిన వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడటాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తల్లి చేష్టలు, ఆమె ప్రియుడి వేధింపులతో విసిగిపోయిన యువతి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలను వదిలింది. 

ఈ దారుణం తమిళనాడులోని పుదుకోటలో చోటుచేసుకుంది. భర్తకు దూరంగా వుంటున్న ఓ మహిళ 11ఏళ్ల కూతురుతో కలిసి పట్టణంలో నివసిస్తోంది. అయితే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే గణేషన్ కు ఆమెతో పరిచయం ఏర్పడి అది అక్రమసంబంధంగా మారింది. దీంతో గణేషన్ ఎప్పుడూ సదరు మహిళ ఇంట్లోనే వుండేవాడు. 

read more   కాళ్లు నరికి, పెట్రోల్ పోసి...హైదరాబాద్ శివారులో మహిళ దారుణ హత్య

ఈ క్రమంలోనే అతడి కన్ను సదరు మహిళ కూతురిపై పడ్డాయి. దీంతో బాలికకు నిద్ర మాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇలా పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  

అతడి లైంగిక వేధంపులను తట్టుకోలేక బాలిక దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ  లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం బాలిక తల్లిని, ప్రియుడిని విచారించగా అసలు విషయం బైటపడింది. దీంతో గణేషన్ పై నగర్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు  నమోదు చేసి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.