హైదరాబాద్ శివారులోని ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఆమె ఒంటిపై వున్న నగలను కాజేయడానికి పథకం ప్రకారం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఓ దుండగుడు అతి దారుణంగా హత్యచేసి నగలను దొంగిలించాడు. ఇదంతా చేసింది మృతురాలికి బాగా తెలిసిన వ్యక్తే. 

ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని వనస్ధలిపురంకు చెందిన మైసమ్మ ఇటీవల బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సదరు మహిళ హత్యకు గురయినట్లు గుర్తించారు. 

read more  వికారాబాద్ కిడ్నాప్ : తానే భర్తతో వెళ్లానంటున్న దీపిక.. నిజాలు రాబడుతున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కోహెడ రొడ్డు రాందాస్ పల్లి శివారులో మైసమ్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాళ్లు నరికి,   పెట్రోల్ పోసి కాల్చిన స్థితిలో మృతదేహం లభ్యమయ్యింది.ఈ దారుణానికి మృతురాలి ఇంటిపక్కనుండే ఆటో డ్రైవర్ సతీష్ కారణమని పోలీసులు గుర్తించారు. మైసమ్మ ఒంటిపై వుండే నగలను కాజేయడానికే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో వున్న అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.