ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఇలా గర్భం దాల్చడం స్థానికంగా కలకలం రేపింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే....ఒడిశా రాష్ట్రం కొంధమాల్ జిల్లా బెల్ ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి  చదువుతోంది. కాగా ఉన్నట్లుండి బుధవారం ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. గమనించిన పాఠశాల నిర్వాహకులు ఆస్పత్రికి తరలించి... వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది.

వెంటనే పాఠశాల నిర్వహాకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాలిక గర్భానికి కారణమైన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అమూల్య ప్రధాన్(23)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.