పోలీసులు కొంతమంది "తమ కూతురి మృతదేహాన్నిఅప్పగించి రాత్రిపూట అప్పటికప్పుడు దహనసంస్కారాలు చేయాలని ఆదేశించారని, తాము ఏమీ ఏర్పాట్లు చేసుకోలేదన్నా వినలేదని బలవంతంగా అంత్యక్రియలు చేయించారు’ అని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటన మీదఐపీసీ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నలుగురు నిందితుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు. 

మీరట్ : uttarpradeshలోని బులంద్‌షహర్‌లో మరో హత్రాస్ ఘటన చోటు చేసుకుంది. ఓ 16 యేళ్ల బాలికను దారుణ హత్యాచారానికి గురైంది. అయితే పోలీసులు హడావుడిగా బాలిక cremation చేయించడంతో తల్లిదండ్రులు తమ కూతురి deathపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయేముందు కూతురి మీద gang rape జరిగిందని ఆరోపిస్తూ, ఆమె అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేయకముందే పోలీసులు మైనర్‌ను దహనం చేయమని బలవంతం చేశారని ఆరోపించింది.

దీంతో ఈ సంఘటన మంగళవారం భారీ నిరసనలకు దారితీసింది. 2020లో జరిగిన దిగ్భ్రాంతికరమైన హత్రాస్ కేసు జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చేలా చేసింది. 19 ఏళ్ల దళిత బాలికను గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన యువకులు వేధించి, హత్య చేశారు. ఈ ఘటన మీద నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండగానే.. పోలీసులు ఆమె మృతదేహాన్ని హడావిడిగా దహనం చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

ఇక మీరట్ లో జరిగిన ఘటనలో "దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ సంఘటన జనవరి 21 న జరిగింది. అయితే పోలీసులు వారిని బెదిరించడంతో కుటుంబసభ్యులు మౌనంగా ఉన్నారు. అయితే ఈ విషయం బైటికి పొక్కడంతో రాజకీయ నాయకులు దీనిమీద ట్వీట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది" అని గ్రామస్థుల్లో ఒకరు చెప్పారు. ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ కేసుపై ట్వీట్ చేశారు.

పోలీసులు కొంతమంది "తమ కూతురి మృతదేహాన్నిఅప్పగించి రాత్రిపూట అప్పటికప్పుడు దహనసంస్కారాలు చేయాలని ఆదేశించారని, తాము ఏమీ ఏర్పాట్లు చేసుకోలేదన్నా వినలేదని బలవంతంగా అంత్యక్రియలు చేయించారు’ అని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటన మీదఐపీసీ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నలుగురు నిందితుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు.

బాధితురాలి తండ్రి, ఓబీసీ.. ఆయన మాట్లాడుతూ తన కుమార్తె, అగ్రవర్ణ బాలుడు స్నేహితులు. అలా తరచుగా బాలుడు అమ్మాయి ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు కూడా బాలుడు బాలిక గ్రామానికి వచ్చి తనతో పాటు విహారయాత్రకు రమ్మని అడిగాడు. దీనికి ఆమె అంగీకరించి అతని బైక్‌పై కూర్చుని వెళ్లింది.

"తర్వాత, నా కుమార్తె మృతదేహం గ్రామ శివార్లలోని గొట్టపు బావి దగ్గర పడి ఉందని పోలీసుల నుండి నాకు కాల్ వచ్చింది. నేను సంఘటనా స్థలానికి చేరుకున్నాను, కానీ నేను చేరుకునే సమయానికి, వారు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తీసుకెళ్లారు. మేం అక్కడే వేచి ఉన్నాం. దాదాపు 24 గంటల తర్వాత మృతదేహాన్ని మాకు ఇచ్చారు. అంతే కాదు వెంటనే ఆమెను దహనం చేయాలని బలవంతం చేశారు ”అని అతను చెప్పాడు.

ఈ ఘటన మీద బులంద్‌షహర్ ఎస్‌ఎస్పీ సంతోష్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు "బాలికను దహనం చేయమని కుటుంబాన్ని బలవంతం చేయలేదు" అన్నారు. అంతేకాదు ఈ విషయాన్ని కావాలని "రాజకీయం చేస్తున్నారు" అని అన్నారు.