సమాజం రోజు రోజుకీ ఎంత దారుణంగా మారిపోతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే బిడ్డల పట్ల కసాయి వాళ్లలాగా ప్రవర్తించారు. బయట ఎవరివల్ల అయినా ఆపద వస్తే రక్షించాల్సిన వారే... భక్షకులుగా మారారు. తండ్రి కూతుళ్లపై కామాంతో చూస్తే... దానికి తల్లి సహకరించడం దారుణం. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని లక్నోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లక్నోకు చెందిన ఓ యువతి(21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు(6) పై కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన సోదరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చింది. 

ఇంట్లో జరుగుతుందంతా తల్లికి తెలిసినప్పటికీ నోరు మెదపకపోవడంతో పాటు తండ్రికి సహకరిస్తూ తనకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది. దీంతో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో)2012 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.