లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  17 ఏళ్ల బాలికను అర్ధనగ్నంగా చేసి బాధిత కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  గోరఖ్‌పూర్ జిల్లా చౌరీచౌరా ప్రాంతంలో ఆదివారం నాడు సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకొంది.  గౌతమ్, ముఖేష్ అనే ఇద్దరు వ్యక్తులు తనపై అసభ్యవ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ నిందితుల పద్దతుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.  బాధితురాలి కుటుంబసభ్యులు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని  నిర్ణయం తీసుకొన్నారు.

ఈ క్రమంలోనే కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న సమయంలోనే నిందితులు ఇద్దరూ వారిని అడ్డుకొని దాడికి దిగారు. బాలిక దుస్తులు చించేశారు. బాధితురాలి తండ్రిపై దాడి చేశారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై పోస్కో చట్టంతో పాటు పలు కేసులను నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.