చండీగఢ్: పంజాబ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనాను అడ్డుకోవడానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాస్కుపై మత్తు చల్లడంతో స్పృహ తప్పిన బాలికపై అఘాయిత్యం చేశాడు. 

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. స్థానికంగా ఉండే లేబర్ కాంట్రాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ముఖానికి వేసుకుని మాస్కుపై మత్తు చల్లి దాన్ని బాలికకు ఇచ్చాడు.

ఆ విషయం తెలియని బాలిక మాస్కు ధరించింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో కాంట్రాక్టర్ ఆమెపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమెను బెదిరించాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 

ఆ విషయం చెప్పి బాధితురాలు బోరున విలపించింది. విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.