Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోనుంచి వచ్చేసిన అమ్మాయి.. కిడ్నాప్, అత్యాచారం.. ఆటో డ్రైవర్ అరెస్ట్..

తల్లిదండ్రుల మీద కోపంతో ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లోని నుంచి బయటికి వచ్చింది ఓ బాలిక. ఆమెను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

Girl leaves home to suicide, abducted, raped in Tamil Nadu
Author
First Published Aug 27, 2022, 11:13 AM IST

చెన్నై : తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన 14 ఏళ్ల బాలికను ఆటోరిక్షా డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన ఆవడిలో గురువారం చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.ఇటీవల బాధిత బాలిక కుటుంబం నగరానికి వలస వచ్చింది. అయితే, నగరానికి వచ్చిన తరువాత బాలిక స్కూలుకు వెళ్లడానికి ఇష్టంలేదు. దీంతో స్కూల్ కు వెళ్లమని తల్లిదండ్రులు చెప్పడంతో వారితో బాలిక గొడవపడింది. అదే క్రమంలో గురువారం సాయంత్రం కూడా తల్లిదండ్రులతో బాలిక గొడపడిందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఏదో పనిమీద బయటకు వెళ్లడంతో.. అప్పటికే కోపంతో, మనస్తాపంతో ఉన్న బాలిక.. తాను ఆత్మహత్య చేసుకుంటానని తన చెల్లెలికి చెప్పి రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

తల్లిదండ్రులు తిరిగి వచ్చిన తర్వాత ఆ చిన్నారి ఈ విషయాన్ని వారికి చెప్పింది. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు..ఆమెను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పట్టాబిరంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆటోరిక్షా డ్రైవర్ రామకృష్ణన్ (38) రాత్రి 9 గంటల సమయంలో బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడాన్ని గమనించాడు. ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, అతని బారినుంచి బాలిక తప్పించుకుని, పారిపోతూ రోడ్డుపై ఒక మహిళను కలుసుకుంది. మహిళ ఆమెను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది.

కామాంధుడికి దేహశుద్ధి.. వలసవచ్చిన మహిళలపై కన్నేసి వేధింపులు..

ఈ ఘటనపై ఆవడి అన్ని మహిళా పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు బాలిక చెప్పిన వివరాలతో నేరస్థుడిని పట్టుకోవడానికి పోలీసులు 20 సిసిటివి ఫుటేజీలను తనిఖీ చేశారు. బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా, చుట్టుపక్కల ఉన్న సిసిటివి కెమెరా ఫుటేజీని పరిశీలించిన తరువాత, పోలీసులు రామకృష్ణను నిందితుడిగా గుర్తించారు. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద తీవ్రమైన లైంగిక వేధింపుల అభియోగంపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

"అమ్మాయి ఇచ్చిన గుర్తింపు సహాయంతో, మా పోలీసు బృందం కనీసం 20 సిసిటివి కెమెరాల ఫుటేజీని తనిఖీ చేసింది. దీంతో నిందితుడు అక్కడినుంచి పారిపోకముందే పట్టుకోగలిగింది’ అని ఇన్స్పెక్టర్ టి లత చెప్పారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios