పెద్దల కంటే వారికే ఎక్కువగా తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈరోజుల్లో ఫోన్ వాడని పిల్లలు అంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరూ ఫోన్ లకు బానిసలు అయిపోతున్నవారే. అయితే.. ఆ ఫోన్ వాడే క్రమంలో చేతితో పట్టుకోవడం తప్పనిసరి. అంతేకాదు వీడియోలు స్క్రోల్ చేయాలంటే కూడా చెయ్యి తప్పనిసరి. అయితే. ఓ చిన్నారి దానికి కూడా ఓ ఉపాయం ఆలోచించింది.


"ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరం" అనే నానుడి వినే ఉంటారు. అచ్చంగా దానినే ఓ యువతి అమలు చేసి చూపించింది. ఈ రోజుల్లో పిల్లలు సాంకేతికత పట్ల అవగాహన కలిగి ఉంటున్నారు. పెద్దల కంటే వారికే ఎక్కువగా తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిలో ఓచిన్నారి చేతులు ఉపయోగించకుండా వీడియోలను స్క్రోల్ చేసింది. 

Scroll to load tweet…


ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ హ్యూమన్ రేస్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన బెడ్‌పై లాంగ్ చేస్తూ ఫోన్‌లో స్క్రోల్ చేస్తోంది. అయితే, ఆమె చేతులు ఆమె పక్కనే ఉన్నాయి. ఆమె ఫోన్‌ను దిండును ఉపయోగించి తన కాళ్ళపై పెట్టుకుంది. ఆమె ఎలా స్క్రోలింగ్ చేస్తోందో తెలుసా? చిన్నపిల్లలు బూర ఊదుతారు కదా అలాంటిది నోట్లో పెట్టుకొని మరీ వీడియోలను స్క్రోల్ చేయడం విశేషం.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది. చిన్నారి తెలివి చూసి నెటిజన్లు షాకౌతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.