రిషికేశ్‌లోని ఓ పునరావాస కేంద్రంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మేరకు బాలిక ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి పునరావాస కేంద్రంలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ బాలిక ఆరోపించింది. ఈ మేరకు బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషికేశ్‌లో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్న ఢిల్లీకి చెందిన ఓ బాలిక ద్వారా బాధితురాలికి సదరు వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఆ తరువాత కొన్ని రోజులకు బాలికకు మత్తుమందు కలిపిన శీతల పానీయం అందించి, ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె తేరుకున్న తర్వాత, అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలతో ఆమెను బెదిరించారు. బ్లాక్ మెయిల్ చేసి బాలికను నగరం నుంచి బైటికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు" అని పోలీసులు తెలిపారు. ఈ లైంగిక వేధింపులతో విసిగిపోయిన బాలిక ధైర్యం చేసి.. నిందితుడిని అరెస్టు చేయాలని సీనియర్ పోలీసు అధికారికి లేఖ రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నామని.. దీనిమీద తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు కొత్వాలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి సైనీ తెలిపారు.
అనుమానంతో కొండపైకి తీసుకువెళ్లి భార్య హత్య.. నెల తరువాత లభించిన ఆనవాళ్లు..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన తమిళనాడులో జూలై 9న వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమతో పాటు చదువుకుంటున్న విద్యార్థిని మీద ముగ్గురు అబ్బాయిలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. సహవిద్యార్థి అయిన పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ముగ్గురు 10వ తరగతి విద్యార్థులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఈ లైంగిక వేధింపుల సమయంలో వీడియో తీసి.. మిగతా వారికి షేర్ చేశారు ఈ ముగ్గురు. వీరితో పాటు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, వేధిస్తున్నందుకు మరో అబ్బాయిని అరెస్టు చేశారు. తిట్టకుడిలోని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కిరుబా మాట్లాడుతూ, "కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన దారుణమైనది.
ఈ నేరం ఆరోపించిన లో మైనర్‌లందరూ నేరస్థులే. ఆమెను వారు మొదట.. విద్యార్థిని తన ప్రియుడితో ఉన్న ఫోటోతో బ్లాక్‌మెయిల్ చేసారు. అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిని ఓ అబ్బాయి ఇంటికి రావాలని బెదిరించారు. అక్కడికి వచ్చాక అఘాయిత్యానికి పాల్పడ్డారు’ అని చెప్పారు. బాలిక ఇటీవల తన బాయ్ ఫ్రెండ్, మాజీ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకల కోసం అతడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అబ్బాయి, అమ్మాయి కలుసున్న ఫొటోను ముగ్గురు నిందితుల్లో ఒకరు.. సంపాదించారు. దాన్ని చూపిస్తూ ఆమె మీద బ్లాక్ మెయిల్ కు దిగాడు. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని చెప్పి బెదిరించాడు. అలా చేయద్దంటే స్కూల్ వెనుక ఉన్న తన ఇంటికి రమ్మని కోరాడు. ఈ నెల మొదటి తేదీన ఆమె లంచ్ బ్రేక్ టైంలో అక్కడికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ముగ్గురు అబ్బాయిలు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఇందులో ఒకరు దీన్ని మొత్తం వీడియో తీశారు. ఆ తర్వాత ఈ వీడియోను మిగతా విద్యార్థులతో పంచుకున్నారు. తన తల్లికి జరిగినదంతా చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
