ఏకాంతంగా గడపటానికి బీచ్‌కు వచ్చిన ప్రేమ జంట పైశాచిక దాడికి గురైంది. ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి అతని కళ్లేదుటే ప్రియురాలిపై ఏడుగురు కామాంధులు అత్యాచారం చేశారు. మంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న యువకుడు అదే సంస్థలో పనిచేసే యువతి కొద్దరోజులుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఏకాంతం కోసం ఈ నెల 18న స్థానికంగా ఉన్న బెంగ్రే బీచ్‌కు వెళ్లారు. వీరిని గమనించిన ఏడుగురు కామాంధులు ఈ జంటను వెంబడించారు. ఇద్దరిని బంధించి బీచ్ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువకుడిని చెట్టుకు కట్టేశారు. అతడి ఎదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతనం ఇద్దరిని అక్కడే వదిలేసి వెళ్లారు...షాక్ నుంచి తేరుకున్న యువతి తన ప్రియుడిని విడిపించి ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో దక్షిణ కన్నడ జిల్లాలోని పాండేశ్వరలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని... మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ కామాంధులంతా కల్లడ్క ప్రాంతంలోని జాలర్లుగా గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు.