బయటకు వెళుతూ షూ వేసుకోవడానికి వెళితే అందులో నుంచి బుసలు కొడుతూ పాము బయటకు కనిపించింది. అంతే షాక్ అయిపోయాడు. కొంచెం తొందరడపడి కాలు పెడితే.. పాము కరిచేదే.
బయటకు వెళ్లే సమయంలో షూస్ వేసుకోవడం చాలా కామన్. అలా షూస్ వేసుకునే సమయంలో అందులో పాము కనపడితే మీకు ఎలా ఉంటుంది..? దాదాపు గుండె ఆగినంత పని అవుతుంది. ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. బయటకు వెళుతూ షూ వేసుకోవడానికి వెళితే అందులో నుంచి బుసలు కొడుతూ పాము బయటకు కనిపించింది. అంతే షాక్ అయిపోయాడు. కొంచెం తొందరడపడి కాలు పెడితే.. పాము కరిచేదే. ఈ సంఘటన మైసూర్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుు ఇలా ఉన్నాయి.
Scroll to load tweet…
మైసూర్ లోని ఓ వ్యక్తి షూ వేసుకోవడానికి వెళ్లగా.. పాము కనిపించింది. వెంటనే బయపడిపోయాడు. కానీ తర్వాత తేరుకొని వెంటనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేశాడు. స్నేక్ క్యాచర్ వచ్చి... పాము ను బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీనిని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
