Asianet News TeluguAsianet News Telugu

డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ చైర్మన్‌గా గులాం నబీ ఆజాద్ ఎన్నిక‌

కాంగ్రెస్ నుంచి విడిపోయి జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల సొంతంగా డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్ తన పార్టీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల ఏకగ్రీవంగా జరిగింది. 

Ghulam Nabi Azad was elected as the Chairman of Democratic Azad Party
Author
First Published Oct 1, 2022, 2:16 PM IST

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త‌గా ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ)కి ఆయ‌నే చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు. జమ్మూ, శ్రీనగర్‌లో జరిగిన వ్యవస్థాపక సభ్యుల సెషన్‌లో ఈ మేరకు శ‌నివారం తీర్మానం ఆమోదం పొందింది. ఈ ఎన్నిక ఏక‌గ్రీవంగా జ‌రిగింద‌ని ఆజాద్ తెలిపారు.

పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కారణంగానే పీఎఫ్‌ఐపై నిషేధం.. అది స్వార్థపూరిత చర్య: మాయావతి విమర్శలు

యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ ఈ ఏడాది ఆగ‌స్టు 26వ తేదీన అనూహ్యంగా సొంత పార్టీని వీడారు. ఆయ‌న‌ ప‌లువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌ముఖ‌ల మ‌ద్దతుతో సెప్టెంబర్ 26వ తేదీన జమ్మూలో DAPని ప్రారంభించారు. ఆయ‌న కు మ‌ద్దతు తెలిపిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కంటిన్యూ? సచిన్ పైలట్‌కు ఆ పదవి ఇచ్చే ఛాన్స్

ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు పీర్జాదా మొహమ్మద్ సయీద్, తాజ్ మొహియుద్దీన్, జిఎం సరూరి, ఆర్ఎస్ చిబ్, జుగల్ కిషోర్, మాజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ తదితరులు ఉన్నారు. కాగా.. ఆజాద్ సెప్టెంబర్ 27వ తేదీన జమ్మూకి తిరిగి వ‌చ్చేందుకు ముందు ఆయ‌న నాలుగు రోజులు కాశ్మీర్‌లో గడిపారు.

మూడు ద‌శ‌బ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌.. జ‌మ్మూ కాశ్మీర్ లో సినిమా హాళ్లు రీ ఓపెన్..

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం క‌లిగి ఉన్న 73 ఏళ్ల ఆజాద్ ఆ పార్టీని వీడారు. అనంత‌రం ఆ పార్టీ హైక‌మాండ్ పై విమ‌ర్శ‌లు చేశారు. యూపీఏ ప్రభుత్వ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిన రిమోట్ కంట్రోల్ మోడల్‌ను పార్టీకి అన్వ‌యించినందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆమెను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. సోనియా గాంధీ కేవలం నామమాత్రపు వ్యక్తి అని, అన్ని ముఖ్యమైన నిర్ణయాలను రాహుల్ తీసుకుంటున్నారని, లేక‌పోతే ఆయ‌న సెక్యూరిటీ గార్డులు, పీఏలు మ‌రింత దారుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపిన ఐదు పేజీల రాజీనామా లేఖలో ఆజాద్.. భారీ హృదయంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ కంటే ముందే ‘కాంగ్రెస్ జోజో యాత్ర’ చేపట్టాల్సి ఉందని అన్నారు. అలాగే ఈ లేఖ‌లో రాహుల్ గాంధీ ప్రవర్తనను నిందించారు.పార్టీలో ఏ స్థాయిలోనూ ఎన్నికలు జరగలేదని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్‌ తన సంకల్పాన్ని, పోరాట పటిమను కోల్పోయిందని గులాబ్ న‌బీ ఆజాద్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios