Asianet News TeluguAsianet News Telugu

పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కారణంగానే పీఎఫ్‌ఐపై నిషేధం.. అది స్వార్థపూరిత చర్య: మాయావతి విమర్శలు

Mayawati: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని  అనుబంధ సంస్థలపై ఐదేళ్ల నిషేధం విధించాలన్న కేంద్రం చర్యను ‘స్వార్థపూరిత‌ రాజకీయ ఎత్తుగడ’ అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి మాయావతి అభివర్ణించారు.
 

Ban on PFI due to upcoming elections in many states; It's a selfish move: Mayawati criticizes
Author
First Published Oct 1, 2022, 2:05 PM IST

Bahujan Samaj Party chief Mayawati: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి మాయావతి కేంద్రంలోని భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ) స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ప్ర‌భుత్వం త‌న స్వార్థ‌పూరిత రాజ‌కీయ‌ల కోసం ప్ర‌స్తుతం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని ఆరోపించారు. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ ఆమె పై వ్యాఖ్య‌లు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని సోదర, అనుబంధ సంస్థలపై కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించిన చ‌ర్య‌ను స్వార్థ రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని విమ‌ర్శించారు. 

మాయావతి తన ట్వీట్‌లో ఈ చర్యను రాబోయే రాష్ట్రాల ఎన్నికలతో ముడిపెట్టారు. “పీఎఫ్ఐని అనేక విధాలుగా లక్ష్యంగా చేసుకున్న త‌ర్వాత‌.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ, దాని ఎనిమిది సహచర సంస్థ‌ల‌పై నిషేధించింది. దీనిని ప్రజలను సంతృప్తి పరచడానికి బదులు అశాంతి కలిగించే రాజకీయాలు అంటారు అని మాయావ‌తి పేర్కొన్నారు.  “అందుకే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఎఫ్‌ఐ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే, ఇలాంటి అనేక సంస్థలను ఎందుకు నిషేధించకూడదని వారు అడుగుతున్నారు”అని మాయావ‌తి అన్నారు.

ఇతర రాజకీయ నేతలు కూడా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని ప్రశ్నించారు. కర్ణాటకలో పీఎఫ్‌ఐ నిషేధంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మాయావ‌తి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇది సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించించారు. ప్ర‌స్తుతం మాయావతి సైతం తన ట్వీట్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలనే అభిప్రాయం వ్య‌క్తంచేసిన‌ట్టు తెలుస్తోంది. ఇండియా టుడేతో మాట్లాడిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి దయాశంకర్ సింగ్.. మాయావతిపై విమ‌ర్శ‌ల ఎదురుదాడ‌కి దిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ని పీఎఫ్ఐతో పోల్చడం అభ్యంతరకరమని అన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేయలేని సామాజిక పనిని ఆర్‌ఎస్‌ఎస్ చేస్తోంది. ఈ దేశంలో, సామాజిక, ఆర్థిక రంగంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ దేశ ప్రయోజనాల కోసం పని చేసింది కాబట్టి రాజకీయాల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదన్నారు.

"ఓట్ల రాజకీయాల గురించి ప్రకటన చేయడం కంటే ముందు ఆలోచించడం మంచిది. మాయావతి, ఆమె విపక్షాల మిత్రపక్షాల ప్రకటనలు కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేవి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తున్నాయి" అని అన్నారు. కాగా, ఎస్పీ అధికార ప్రతినిధి ఉదయవర్ సింగ్ మాట్లాడుతూ, పీఎఫ్‌ఐపై నిషేధం, దర్యాప్తు సంస్థ తన పనిని బీజేపీ రాజకీయం చేయరాదనీ, అయితే స్వేచ్ఛగా పని చేయడానికి బీజేపీ జోక్యం చేసుకోదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే విభజన మనస్తత్వం బీజేపీద‌నీ, అందుకే హిందువులు-ముస్లింల పేరుతో రాజకీయాలు చేసి ఇలాంటివి ప్రచారం చేసే పని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios