Asianet News TeluguAsianet News Telugu

మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రారంభిస్తా: గులామ్‌ నబీ ఆజాద్‌ 

రానున్న‌ పది రోజుల్లో త‌న పార్టీని ప్రకటిస్తానని మాజీ కేంద్రమంతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆదివారం నాడు బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Ghulam Nabi Azad to announce new party in 10 days
Author
First Published Sep 11, 2022, 5:00 PM IST

కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పిన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తాజాగా భారీ ప్రకటన చేశారు. మ‌రో 10 రోజుల్లోగా తన నూత‌న‌ పార్టీ పేరును అధికారంగా ప్రకటిస్తానని అన్నారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న పార్టీకి ఇంకా పేరు పెట్టాలేదని, త‌న పార్టీకి జమ్మూ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా  పార్టీకి హిందుస్థానీ పేరు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, స్థానికులకు ఉపాధి తదితర అంశాలపై పార్టీ పోరాడుతుందని అన్నారు.

తాను బీజేపీకి చెందినవాడినని చాలా మంది త‌న‌పై ఆరోపణలు చేస్తున్నారని, అయితే.. తాను ప్రవక్త బానిసను మాత్రమేనని అన్నారు. తాను ఆర్టిక‌ల్ 370కి వ్యతిరేకంగా మాట్లాడానని కూడా కొందరు ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చింది కాంగ్రెస్ అని, తాను దానిని వ్యతిరేకించవలసి వచ్చిందని అన్నారు. జ‌మ్మూకాశ్మీర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్య‌తిరేకంగా.. తాను గళం విప్పిన‌ని అన్నారు. తాను మతం పేరుతో రక్తపాతాన్ని, ఓట్లను ఎప్పటికీ అనుమతించననీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370పై త‌న‌ ప్రసంగాన్ని కనీసం 200 దేశాల వారు విన్నార‌నీ ,  ఆర్టిక‌ల్ 370పై తాను మాట్లాడడం లేదని అంటున్నార‌ని అన్నారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు  తాను రాలేదనీ, ఈ సందిగ్ధంలో లక్ష మంది యువతను కోల్పోయామ‌ని అన్నారు. 

అదే త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ పై విరుచ‌క‌ప‌డ్డారు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్‌కు 50 సీట్లకు మించి రాలేదన్నారు.  మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను" అని నేతాజీ అన్న‌ట్లుగా  "మీరు నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు రక్తం ఇస్తాను" అని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఇంకా మాట్లాడుతూ, 'నేను ప్రతిపక్ష నాయకుడిని కాకపోతే, పార్లమెంటులో కాశ్మీర్ గురించి ఎవరూ లేవనెత్తరు' అని ఆయన అన్నారు.

గులాం నబీ మాట్లాడుతూ.. '1990 నాటి విషాదం..  కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు, సిక్కులతో సహా ప్రతి ఒక్కరి ప్రాణాలను తీసింది. చాలా మంది కాశ్మీరీ పండిట్లు పారిపోవాల్సి వచ్చింది. కాశ్మీర్ భారీగా నష్టపోయింది. ఆ సమయంలో ప‌లు బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా జరిగాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఉగ్రవాదులను హతమార్చడంపై ఎలాంటి అల‌స్యం జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

అలాగే.. జమ్మూకాశ్మీర్ ను మొఘలులు 800 ఏండ్ల పాటు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏండ్ల పాటు  పాలించారని అన్నారు. జమ్ము కశ్మీర్‌లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఇప్పటికీ ఉన్నారని స్థానిక ప్రాంతాయ పార్టీలను విమ‌ర్శించారు. ప‌లువురు జమ్మూ కశ్మీర్‌ను దోచుకున్నార‌ని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత.. అంతర్గత రాజకీయాలకు జ‌మ్మూ కాశ్మీర్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios