Asianet News TeluguAsianet News Telugu

ప్రధానైనా రూట్స్ మరిచిపోలేదు: మోడీపై ఆజాద్ ప్రశంసల వర్షం

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని అయ్యాక కూడా ఆయన రూట్స్ ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని మోడీ చాలా సార్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు

ghulam nabi azad praises pm narendra modi again ksp
Author
New Delhi, First Published Feb 28, 2021, 3:13 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని అయ్యాక కూడా ఆయన రూట్స్ ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని మోడీ చాలా సార్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు. మనం ఏ స్థాయిలో వున్నా గతాన్ని మరిచిపోకూడదన్నారు ఆజాద్. 

కాగా, కొద్దిరోజుల క్రితం రాజ్యసభలో ఆజాద్‌కు వీడ్కోలు చెబుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన కాసేపు ప్రసంగించారు.

ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడేటప్పుడు మోదీ కంటతడి పెట్టుకున్నారు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ దేశానికీ అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని వ్యాఖ్యానించారు.

ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర సభ్యులు, భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఆజాద్ పనితీరును అందుకోవడం చాలా కష్టమని కితాబిచ్చారు.

తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం ఆయన పనిచేశారని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కశ్మీర్‌లో ఓసారి ఉగ్రదాడి జరిగినప్పుడు గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకునిపోయిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో ఆజాద్‌తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగానికి గురయ్యారు

Follow Us:
Download App:
  • android
  • ios