Asianet News TeluguAsianet News Telugu

గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారా? ఇంతకీ ఆయన ఏం సమాధానమిచ్చారు.  

తాను మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నాననే వార్తలల్లో ఎలాంటి వాస్తవం లేదనీ, అవన్నీ  నిరాధారమైన ఆరోపణలని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆ కథనాలను చూసి తాను షాక్ అయ్యానని చెప్పాడు. ఆ ఊహాగానాలకు ముగింపు పలుకలని అన్నారు. 

Ghulam Nabi Azad On Congress Return Plan Bharat Jodo Yatra
Author
First Published Dec 31, 2022, 3:34 AM IST

కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చే ఉద్దేశం తనకు లేదని కొత్తగా ఏర్పాటైన 'డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ' సీనియర్ నేత, అధినేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్‌లో చేరే చర్చపై ఆయనే స్వయంగా స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ పుకార్లను మాత్రమేననీ, కాంగ్రెస్ నేతలు కావాలని ప్రచారం చేశారని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్ దానిని రెండు ట్వీట్లలో తోసిపుచ్చారు. 
 

ఆజాద్ ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్‌తో ఉన్న 52 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి , జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, తాను పాత పార్టీలోకి తిరిగి రావాలనే సూచనను కాంగ్రెస్‌లోని కొంతమంది స్వార్థ ప్రయోజనాల నాయకులు చేశారని, అందులో వాస్తవం లేదని శుక్రవారం అన్నారు.


ఆజాద్ మాట్లాడుతూ.. తాను ఏ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడలేదు, ఎవరూ తనకు ఫోన్ చేయలేదనీ స్పష్టం చేశారు. అయినా..  మీడియాలో ఇలాంటి కథనాలు ఎందుకు వస్తున్నాయనేది ఆశ్చర్యంగా ఉంది. తమ పార్టీ కార్యకర్తల్లో అనిశ్చితిని సృష్టించేందుకు, వారిని నిరుత్సాహపరిచేందుకు కాంగ్రెస్ నేతలు ఈ ప్రయత్నాలు చేశారని ఆజాద్ అన్నారు. ఏది వచ్చినా..  మనం మరింత బలంగా పుంజుకుంటాం కార్యకర్తలకు దీమా వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రవేశించనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర'లో చేరతారా అని అడగ్గా.. ఆజాద్ తనకు అలాంటి ప్రణాళికలు లేవని అన్నారు. తనకు స్వంత పనులు చాలా ఉన్నాయని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios