Asianet News TeluguAsianet News Telugu

ఆజాద్ పార్టీలో కల్లోలం.. ముగ్గురు బడా నేతల బ‌హిష్క‌ర‌ణ‌.. కార‌ణం ఏంటంటే..?

గులాం న‌బీ ఆజాద్ నూతనంగా ఏర్పాటు చేసిన డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ కల్లోలం నెలకొంది. ముగ్గురు సీనియర్ నాయ‌కులు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డారు. దీంతో వారిని ఆజాద్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. ఈ ముగ్గురు నేతలు గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది

Ghulam Nabi Azad Expels 3 Leaders In Blow To New Party
Author
First Published Dec 23, 2022, 3:22 AM IST

కాంగ్రెస్ మాజీ నేత‌ గులాం న‌బీ ఆజాద్ ఇటీవల పార్టీని వీడి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) అనే నూతన పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీ ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే పార్టీలో విపరీతమైన కల్లోలం నెలకొంది. డివిజనల్‌ కార్యదర్శి జైసింగ్‌ పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే.. ఇప్పుడు ముగ్గురు పెద్ద నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కార్యకలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై  మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్, మాజీ మంత్రి డాక్టర్ మనోహర్ లాల్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ లను ఆజాద్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. గ్గురినీ బహిష్కరిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజిందర్ సింగ్ చిబ్ ప్రకటన విడుదల చేశారు.ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్‌ను వీడి డీఏపీలో చేరారు. ఇదిలా ఉండగా, తాను పుట్టుకతో కాంగ్రెస్‌వాది అయినందున మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తారాచంద్ ప్రకటించారు.

ఆజాద్ పార్టీ లౌకిక ఓట్లను మాత్రమే విభజించినందున తాను కాంగ్రెస్‌లోకి తిరిగి రావచ్చని తారాచంద్ అన్నారు. ఈ ముగ్గురు నేతలు గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ నేతలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారనే ఊహాగానాలు వచ్చాయి.

ఆజాద్‌కు జమ్మూపై ఆసక్తి లేదు: బల్వాన్

ఆయనను పార్టీ నుంచి ఎందుకు గెంటేశారో మాకే తెలియదు. పార్టీ బలోపేతానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. గులాం నబీ ఆజాద్ ఒక్కడే అనుకున్నాం. మనం వారికి మద్దతివ్వాలి. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి వారికి మద్దతిచ్చాం. ఎవరి మాటలు విని మమ్మల్ని పార్టీ నుంచి గెంటేశారు. వారికి జమ్మూపై ఆసక్తి లేదు. మేమే జమ్మూలో వారి సమావేశాలను నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ పేర్కొన్నారు

ముగ్గురూ నేతలకు స్వాగతం : కాంగ్రెస్ అధ్యక్షుడు రసూల్ 

గులాం నబీ ఆజాద్ నమోదుకాని పార్టీలో చాలా మంది కాంగ్రెస్ నేతలు హడావుడిగా వెళ్లిపోయారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వికార్ రసూల్ అంటున్నారు. ఇప్పుడు వారు వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్రంలో జరగనున్న భారత్ జోడో యాత్రలో మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి డాక్టర్ మనోహర్ లాల్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ లు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఘనస్వాగతం పలుకుతామని, వారు కూడా పార్టీలో భాగమేనని అన్నారు.  

కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో గులాం న‌బీ ఆజాద్ పార్టీ వీడారు.సెప్టెంబ‌ర్ 26న డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ పెట్టారు. ఈయ‌న రాజ్య స‌భలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌నిచేశారు. 2005 నుంచి 2008 వ‌రకు ఉమ్మ‌డి జ‌మ్ము క‌శ్మీర్‌కు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు.

Follow Us:
Download App:
  • android
  • ios