Asianet News TeluguAsianet News Telugu

పార్టీ పేరును ప్రకటించిన గులాం నబీ ఆజాద్.. దాని జెండా, ఇతర వివరాలు ఇవిగో

Ghulam Nabi Azad: కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్  జమ్మూ కాశ్మీర్ లో  తన కొత్త పార్టీ పేరును ప్ర‌క‌టించారు. అలాగే, పార్టీ జెండాను సైతం ఆయ‌న ఆవిష్క‌రించారు.
 

Ghulam Nabi Azad announced the name of the party. Here are its flag and other details.
Author
First Published Sep 26, 2022, 2:15 PM IST

Democratic Azad Party: కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్  జమ్మూ కాశ్మీర్ లో  తన కొత్త పార్టీ పేరును ప్ర‌క‌టించారు. అలాగే, పార్టీ జెండాను సైతం ఆయ‌న ఆవిష్క‌రించారు. సోమవారం నాడు జమ్మూలో తన కొత్త పార్టీని ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి తన కొత్త రాజ‌కీయ పార్టీకి 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని పేరు పెట్టారు.

వివ‌రాల్లోకెళ్తే.. జ‌మ్మూకాశ్మీర్ రాజ‌కీయ‌ నాయ‌కుడు గులాం నబీ ఆజాద్.. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. కొత్త పార్టీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆజాద్ సోమవారం తన కొత్త రాజకీయ పార్టీ 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'ని ప్రకటించారు. అలాగే, తన పార్టీ జెండాను కూడా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. "స్థానిక, జాతీయ మీడియాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు స్వతంత్ర ఆలోచన.. భావజాలం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య పార్టీ అవుతుంది" అని అన్నారు. "మా పార్టీని నమోదు చేయడమే మా ప్రాధాన్యత. ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. మేము మా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తాము" అని కాంగ్రెస్ మాజీ నాయకుడు చెప్పారు. 

గులాం న‌బీ ఆజాద్ ప్ర‌క‌టించిన ఆయ‌న డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ జెండా నీలం, తెలుపు, పసుపు రంగుల‌తో కూడి ఉంది. "నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లు ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపించారు. హిందీ & ఉర్దూ కలయిక 'హిందూస్థానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా- స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము" అని జమ్మూలో ఆజాద్ అన్నారు. కాగా, పార్టీ పేరు, జెండా వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌డానికి ముందు ఆయ‌న త‌న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో ఆదివారం నాడు స‌మావేశ‌మ‌య్యారు.

త‌మ రాజ‌కీయాలు కులం లేదా మ‌తం ఆధారంగా ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టేందుకు మరే ఇతర పార్టీని సంప్రదించలేదనీ, త‌మ పార్టీకి గాంధీజీ సిద్ధాంతం ఉంటుందని గులాం న‌బీ ఆజాద్ అన్నారు.

అంతకుముందు, ఆజాద్, కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో, పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దృష్టి సారించే తన సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన త‌ర్వాత తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని మొత్తం కూల్చివేసిందని రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖలో, అతను గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios