'ఇష్టానుసారంగా కొట్టారు.. బట్టలు చింపేశారు': ముగ్గురు యువతులపై పబ్ బౌన్సర్ల దాడి..
ఘజియాబాద్‌లోని ఓ పబ్‌లో ముగ్గురు యువతులతో సహా ఐదుగురిపై బౌన్సర్లు దారుణంగా దాడి చేశారు. తమపై బౌన్సర్లు దాడి చేయడమే కాకుండా బాలికల బట్టలు చింపారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కి 25 సార్లు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితులు వాపోయారు. బాధితురాలి ఆరోపణల మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఘజియాబాద్‌లోని ఓ పబ్‌లో ముగ్గురు బాలికలు సహా ఐదుగురిపై బౌన్సర్లు దారుణంగా దాడి చేశారు. తమపై బౌన్సర్లు దాడి చేయడమే కాకుండా బాలికల బట్టలు చింపారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కి 25 సార్లు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితులు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఇందిరాపురంలోని థ్రస్ట్ ఆఫ్ డ్రంక్స్ (టీఓడీ) బార్ డి మాల్‌లోకి తన ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లినట్టు బాధిత బాలిక తెలిపింది. తమపై పబ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారనీ, తమను రక్షించడానికి వచ్చిన తన సోదరులుపై కూడా బౌన్సర్లు దాడి చేశారు. బాధితురాలి సోదరుడి చేతికి, పక్కటెముకలకు తీవ్ర గాయాలైనట్టు తెలిపింది. బాధితులు ఢిల్లీ నుంచి ఘజియాబాద్ పబ్‌కు వచ్చినట్లు సమాచారం. ఒక బాలిక ఫిర్యాదు ఆధారంగా.. పబ్ యజమాని , సిబ్బందిపై వసుంధర సెక్టార్ 10 (ఘజియాబాద్) నివాసి రోనక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
నచ్చిన పాట ప్లే చేయకపోవడంతో..
ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలోని డి మాల్‌లో ఉన్న థ్రస్ట్ ఆఫ్ డ్రంక్స్ (టిఓడి) (రెస్టారెంట్ అండ్ లాంజ్)ని తన ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులతో కలిసి సందర్శించినట్లు షబ్నం అనే బాధితురాలు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమయంలో తమకు నచ్చిన పాటను ప్లే చేయమని పబ్ సిబ్బందిని కోరమనీ.. అయితే తాము కోరిన పాటలను ప్లే చేసేందుకు సిబ్బంది రూ.500 డిమాండ్ చేశారని తెలిపింది. అందుకు తాము వెనుకాడకుండా 1500 రూపాయలు చెల్లించి మూడు వేర్వేరు పాటలను ప్లే చేయమని కోరామని తెలిపింది. డబ్బులు చెల్లించినప్పటికీ, సిబ్బంది కోరిన పాటలను ప్లే చేయడానికి నిరాకరించడంతో వాగ్వాదానికి దారితీసింది.
ఇంతలో పబ్ లోని బౌన్సర్లు అక్కడికి వచ్చి అమ్మాయిలతో గొడవకు దిగారు. ఈ క్రమంలో బాధిత బాలిక సోదరులు ఆమె రక్షించడానికి ప్రయత్నించారు, కానీ, వారిని కూడా తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో ఓ బాలుడి చేతి విరిగిపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ ట్రాన్స్ హిండన్ దీపక్ యాదవ్ తెలిపారు. తెల్లవారుజాము వరకు లౌడ్ మ్యూజిక్ ప్లే చేయడానికి సంబంధించిన సెక్షన్‌ను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పబ్‌లోని సంగీత వాయిద్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 323, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.