ఈ విన్యాసాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 


బైక్ పై ఓ యువతి విన్యాసాలు చేసింది. ఎలాంటి సేఫ్టీ చూసుకోకుండా డేంజర్ స్టంట్స్ చేసింది. కాగా.. సదరు యువతికి పోలీసులు రూ.11వేల జరిమానా విధించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ శివార్లలో ఓ యువతి బుల్లెట్‌ బండి నడుపుతూ తన భుజాలపై మరో యువతిని ఎక్కించుకుని ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు బైక్‌ స్టంట్స్‌ చేసిన సదరు యువతిని గుర్తించారు. అనుమతిలేకుండా డేంజర్‌ స్టంట్స్‌ చేసినందుకు ఆమెకు ఘజియాబాద్‌ ఆర్టీఓ అధికారి కేసు నమోదు చేసి రూ.11,000 జరిమానా విధించారు. 

Scroll to load tweet…

బుల్లెట్‌ బైక్‌పై డేంజర్‌ స్టంట్స్‌ చేస్తున్న యువతికి సంబంధించిన 12 నిమిషాల నిడివి గల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, సదరు యువతులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఎస్‌పీ తెలిపారు. ఆర్టీఓ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ నడిపినందుకు ఆమెకు ఆర్టీఓ అధికారులు జరిమానా విధించారని ఆయన పేర్కొన్నారు. ప్రజావాహనాలు నడిపే రహదారిలో ఇలాంటి స్టంట్స్ చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని, ఇలాంటి స్టంట్స్‌ చేసే వారిని జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.