కేరళ రాష్ట్ర పర్యటనకు వచ్చిన జర్మనీ మహిళ ఆదృశ్యమవ్వడం రెండు దేశాల్లో కలకలం రేపింది. జర్మనీకి చెందిన లీసా వీసా అనే 31 ఏళ్ల మహిళ మార్చి 7వ తేదీన కేరళ పర్యటనకు వచ్చింది.

మార్చి 10వ తేదీన లీసా వీసా అదృశ్యమయ్యారు. తమ దేశస్థురాలు అదృశ్యం కావడంతో జర్మనీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీసుతో పాటు గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది.

జర్మనీ మహిళతో పాటు యూకే జాతీయుడైన అలీ మహ్మద్‌ విమానంలో వెంట వచ్చాడని కేరళ పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే లీసా వారం రోజుల తర్వాత తిరిగి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని చెబుతున్నారు.

లీసా అదృశ్యంపై ఆమె తల్లి జర్మన్ రాయబారి ద్వారా చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని రాష్ట్ర డీజీపీ లోకనాథ్ బెహ్రా చెప్పారు.

కేరళ రాష్ట్రం పరిధిలోని కొల్లం అమృతానందమయి ఆశ్రమానికి వచ్చేందుకు స్టాక్ హోం నుంచి దుబాయ్ మీదుగా లీసావీసీ తిరువనంతపురం వచ్చి అదృశ్యమైందని నగర పోలీస్ కమిషనర్ ధీనేంద్ర కశ్యప్ చెప్పారు. ఇంటర్‌పోల్ హెచ్చరికతో తాము లీసా కోసం గాలిస్తున్నామని కేరళ పోలీస్ శాఖ తెలిపింది.