ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో రక్షణ రంగంలో పలు ప్రధాన ఒప్పందాలు ఖరారయ్యాయి. ఈ క్రమంలో సోమవారం నాడు ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తాజాగా దీనికి సంబంధించి తుది ఒప్పందం జరిగే అవకాశముంది.
General Electric manufacturing Fighter aircraft project: భారతదేశంలో యుద్ధ విమాన ఇంజిన్‌లను తయారు చేసే ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈసారి అమెరికా ఈ ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. భారతదేశంలో అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ (GE) యుద్ధ విమాన ఇంజిన్ల తయారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. 2012 నుంచి ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. నిజానికి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఒక దశాబ్దానికి పైగా వివాదాల్లో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది.
కేంద్ర రక్షణ శాఖ, అమెరికా రక్షణ కార్యదర్శి మధ్య చర్చలు
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ల మధ్య సోమవారం అత్యంత కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో.. చైనా దూకుడు చర్యలు, పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులతో పాటు జనరల్ ఎలక్ట్రిక్ డీల్‌కు సంబంధించిన అంశాలపై చర్చ సాగినట్టు తెలుస్తోంది. CDS జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. బ్రహ్మోస్ తన కాలపు 'బ్రహ్మాస్త్ర'గా అభివర్ణించారు. IAF తదుపరి వెర్షన్‌తో యుద్ధ విమానాలను సన్నద్ధం చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
GE ఇంజిన్‌ల తయారీ వల్ల ప్రయోజనాలు
ఈ బహుళ-బిలియన్ డాలర్ల GE ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ ప్రాజెక్ట్ యూనిట్ కోసం ఇరు దేశాల ప్రభుత్వాలు ఎంఓయూపై సంతకం చేయనున్నాయి. ఒహియోకు చెందిన GE ఏరోస్పేస్, జనరల్ ఎలక్ట్రిక్ (GE) అనుబంధ సంస్థ. భారతదేశంలో జెట్ ఇంజిన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది.
భారతదేశంలో దాని ఉత్పత్తి ప్రారంభమైతే.. తేజస్ Mk IIతో సహా అన్ని భవిష్యత్ యుద్ధ విమానాలు GE F414 ఇంజిన్‌తో అత్యంత శక్తివంతంగా మారుతాయి. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA), ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (TEDBF) కూడా ఈ ఇంజన్లనే అమర్చుతారు. నిజానికి.. ఈ ఏడాది మార్చిలో అమెరికా వైమానిక దళ కార్యదర్శి ఫ్రాంక్ కెండాల్ భారత్‌తో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో బదిలీ చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అంతేకాకుండా.. ఇండో-పసిఫిక్ సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా వాతావరణంపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. భారతదేశం నుండి సోర్సింగ్‌ను పెంచాలని,భారత సాయుధ దళాలతో ఉపయోగించే పరికరాల కోసం భారతదేశంలో MRO (మెయింటెనెన్స్, రిపేర్ ,ఓవర్‌హాల్) సౌకర్యాలను నెలకొల్పాలని రాజ్‌నాథ్ సింగ్ తన US కౌంటర్‌ను కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
2021లో LCA Mk 1A విమానం కోసం 99 F404-GE-IN20 ఇంజిన్‌ల సరఫరా కోసం GE ఏవియేషన్‌తో ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ USD 716 మిలియన్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 40 LCA ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క ప్రాథమిక వెర్షన్ కూడా F404-GE-IN20 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికా వెళ్లనున్నారు. జూన్ 21-24 వరకు ఆయన అమెరికా పర్యటనలో ఉంటారు. అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్‌లో అతనికి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
