గీతికా శ్రీవాస్తవ ఇస్లామాబాద్‌లోని హైకమిషన్‌లో భారతదేశానికి కొత్త ఛార్జ్ డి'అఫైర్స్‌గా వ్యవహరించనున్నారు. గీతిక త్వరలోనే ఇస్లామాబాద్‌లో బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది. 

ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న గీతికా శ్రీవాస్తవ ఇస్లామాబాద్‌లోని హైకమిషన్‌లో భారతదేశానికి కొత్త ఛార్జ్ డి'అఫైర్స్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు ఆ హోదాలో సురేష్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2005 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన శ్రీవాస్తవ ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ ఇండో పసిఫిక్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

ఆగస్ట్ 2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకోవాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత పాకిస్తాన్ మనదేశంతో దౌత్య సంబంధాలు తగ్గించిన అనంతనం ఇస్లామాబాద్, ఢిల్లీలోని భారత్, పాకిస్తాన్ హైకమీషన్‌లకు సంబంధిత ఛార్జి డి అఫైర్స్ నాయకత్వం వహిస్తున్నారు. గీతిక త్వరలోనే ఇస్లామాబాద్‌లో బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది.