Gautam Adani: అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఇటీవల నిర్వహించిన బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ మొదటి స్థానంలోకి చేరుకున్నాడు. గౌతమ్ అదానీ సంపద ముఖేష్ అంబానీని మించిపోయింది.
Gautam Adani: దేశంలోనే అత్యంత కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకూ ..దేశంలో నెంబర్ 1 ధనవంతుడుగా ఉన్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని పక్కకు తోసి.. అగ్ర స్థానంలో నిలిచారు గౌతమ్ అదానీ. ప్రస్తుత సంవత్సరంలో గౌతమ్ అదానీ సంపద 24 బిలియన్ డాలర్లు పెరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. తాజాగా బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్‌లో ఈ విషయం వెల్లడైంది.
బ్లూంబర్గ్ బిలియనీర్ల నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా అగ్రస్థానంలో నిలిచారు. $100 బిలియన్ల సంపదనతో రిచ్ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఏప్రిల్ 2, 2022 నాటికి, అదానీ నికర విలువ $100 బిలియన్లకు పెరిగింది.
దీంతో ఆయన ప్రపంచ టాప్-10 కుబేరులైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సరసన చేరారు. ముకేశ్ అంబానీ 99 బిలియన్ డాలర్ల సంపదతో వెనకడగు వేశారు. టాప్-10 జాబితాలో చోటు కోల్పోయారు. గడిచిన రెండేండ్లలో అదానీ గ్రూపు షేర్లు వెయ్యి శాతానికి పైగా పెరిగాయి. దీంతో ఆయన సంపద 23.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల $100 బిలియన్ల క్లబ్‌లో చేరారు. ఇదిలా ఉండగా బిలియనీర్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీని అదానీ బిలియన్ అధిగమించింది. అంబానీ సంపద ఇప్పటివరకు $9.03 బిలియన్ల పెరుగుదలతో ఆయన మొత్తం ఆదాయం $99 బిలియన్లకు చేరింది. దీంతో అంబానీ 11వ స్థానంలో నిలిచారు.
గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఆశాజనకంగా పరుగులు తీయడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పటిష్టంగా ఉన్నాయి. అదానీ విల్మార్ షేర్లు దాదాపు 43% లాభపడగా, ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 24%, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 29.5% కంటే ఎక్కువ పురోగమించగా, అదానీ పోర్ట్ షేర్లు దాదాపు 11%, అదానీ ట్రాన్స్‌మిషన్ దాదాపు 4% పెరిగాయి. అలాగే.. అదానీ పవర్ NSE షేర్లు రికార్డు స్థాయిలో దాదాపు 66% పెరిగాయి. మరోవైపు ఏప్రిల్ 1న NSE లో అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అదానీ స్టాక్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.
1988లో స్థాపించబడిన అదానీ గ్రూప్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ US $151 బిలియన్లు. ఇందులో పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, పునరుత్పాదక ఇంధనం, గ్యాస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ (ఓడరేవు, విమానాశ్రయాలు, షిప్పింగ్, రైలు) పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలున్నాయి. మైనింగ్, వనరులు, ఇతర రంగాల్లో పెట్టుబడులున్నాయి.
ప్రపంచంలో టాప్ 10 కుబేరుల వివరాలు:
బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం టెస్లా CEO అయిన ఎలోన్ మస్క్ తొలి స్థానంలో నిలిచారు. అతని నికర విలువ $273 బిలియన్‌లుగా ఉంది. ఆ తరువాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 188 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. LVMH మొయెట్ హెన్నెస్సీ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ $148 బిలియన్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్‌షైర్ హాత్వే CEO వారెన్ బఫెట్ బిలియనీర్ జాబితాలో వరుసగా $ 133 బిలియన్, $ 127 బిలియన్ల నికర విలువతో నాలుగు, ఐదవ స్థానాలను పొందారు.
ఇంకా, సెర్చ్ ఇంజన్ దిగ్గజం, గూగుల్, లారీ పేజ్ $125 బిలియన్ తో ఆరవ స్థానంలో.. సెర్గీ బ్రిన్ సహ వ్యవస్థాపకులు $119 బిలియన్లతో ఏడవ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ మాజీ CEO, లాస్ ఏంజిల్స్ క్లిప్ యొక్క ప్రస్తుత యజమాని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌కు చెందిన స్టీవ్ బాల్మెర్ $108 బిలియన్ల నికర విలువతో 8వ స్థానంలో నిలిచారు. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ 103 బిలియన్ డాలర్ల సంపదతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
