Asianet News TeluguAsianet News Telugu

గౌరీ లంకేశ్ హత్య కేసు... సాధ్వీ ప్రగ్యాసింగ్‌కి క్లీన్ చిట్

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సాధ్వీ ప్రగ్యా సింగగ్ కి ఊరట లభించింది.

Gauri Lankesh killing: SIT denies reports linking Sadhvi Pragya
Author
Hyderabad, First Published May 9, 2019, 3:52 PM IST

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సాధ్వీ ప్రగ్యా సింగగ్ కి ఊరట లభించింది. గౌరీ లంకేశ్ హత్య కేసుకి సాధ్వీ ప్రగ్యాకి ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చి చెప్పింది. ఆమె ప్రమేయమున్నట్టు విచారణలో తాము ఎక్కడా గుర్తించలేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఆమె ప్రమేయాన్ని రుజువు చేసే ఆధారాలు ఎక్కడా లభించలేదని సిట్ పేర్కొంది.

రెండు సంవత్సరాల క్రితం 2017 సెప్టెంబర్ 5వ తేదీన బెంగళూరులోని తన స్వగృహంలో గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఇంటి వద్దనే ఆమెనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపారు.  కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ కేసుతో పాటు 2015లో హత్యకు గురైన ఎంఎం కల్బుర్గీ కేసును కూడా దర్యాప్తు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా గౌరీ లంకేష్ హత్య కేసుకు సాధ్వీ ప్రగ్యా సింగ్ కి సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం సాధ్వీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios