న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఏడుగురు  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం నాడు ప్రకటించారు.

Also read:దేశంలో 29 కరోనా కేసులు, యుద్దప్రాతిపదికన చర్యలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఢిల్లీలో చోటు చేసుకొన్న అల్లర్లపై చర్చించాలని లోక్‌సభలో  విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు  స్పీకర్ పై పేపర్లు చింపి విసిరేశారు.దీంతో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఎంపీలను  ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా  స్పీకర్ ప్రకటించారు.

గురువారం నాడు ఉదయం పూట ఢిల్లీ అల్లర్లపై  చర్చించాలని  విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నెల 13వ తేదీన ఈ విషయమై చర్చిస్తామని కేంద్రం ప్రకటించింది. అయినా విపక్షాలు పట్టువీడలేదు.  

దీంతో గురువారం నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేశారు.  సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అల్లర్లపై చర్చించాలని పట్టుబట్టాయి.ఈ పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చింపి స్పీకర్ పై విసిరివేశారు. దీంతో  కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ్ గోగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, ఆర్‌.ఉన్నితాన్, మనికాం  ఠాగోర్, బెన్నీ బెహ్నన్, గురుజీత్ సింగ్ లను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.