భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలో వరదల్లో ఎల్పీజీ సిలిండర్లు కోల్పోయిన వారికి కేవలం రూ. 200లకే ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్ వెల్లడించారు.

వరదల ప్రాంతం తప్పించి మిగిలిన ప్రాంతాల ప్రజలకు రూ.1200లకు కనెక్షన్ ఇస్తారని ఆయన తెలిపారు. వరద బాధితులకు తక్షణం కొత్త  గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.