Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లో గ్యాంగ్ వార్.. పట్టపగలే రోడ్డుపై కాల్పుల మోత.. గ్యాంగ్‌స్టర్ రాజు తేట్ హత్య

రాజస్తాన్‌లో గ్యాంగ్ వార్ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై గ్యాంగ్ స్టార్ రాజుతేట్‌ను అతని ఇంటి ఎదుటే ఎంట్రెన్స్ దగ్గర తుపాకులతో కాల్చి చంపేశారు. మర్డర్ తర్వాత ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
 

gangwar in broad daylight in rajasthan, accused kills gangster raju theth
Author
First Published Dec 3, 2022, 5:27 PM IST

జైపూర్: రాజస్తాన్‌లో పట్టపగలే కాల్పుల మోత మోగింది. రోడ్డుపైనే బహిరంగంగా గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గ్యాంగ్ వార్‌లో గ్యాంగ్‌స్టర్ రాజు తేట్ హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు మరో స్థానికుడు ఈ బుల్లెట్‌లకు గాయపడి మరణించాడు. ఇందుకు సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. 

గ్యాంగ్‌స్టర్ రాజు తేట్‌ను నలుగురు ప్రత్యర్థి ముఠా సభ్యులు చంపేశారు. రాజు తేట్ ఇంటి ఎదుటే ఎంట్రెన్స్ దగ్గర ఆయనపై ఈ నలుగురు కాల్పులు జరిపారు. రాజస్తాన్‌లోని సికార్ నగరం పిప్రాలీ రోడ్ పై ఉదయం 9.30 గంటలకు రాజు తేట్ పై నిందితులు కాల్పులు జరిపారు.

రాజు తేట్‌కు మూడు బుల్లెట్ గాయాలు అయ్యాయి. షెకావతి రీజియన్‌లోని మరో గ్యాంగ్ సభ్యులు రాజు తేట్ పై దాడి చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం, రాజు తేట్‌పై నలుగురు దుండగులు కాల్పులు జరిపి వెంటనే స్పాట్ నుంచి పారిపోయారు. అందులో ఒకడు గాలిలోకి కాల్పులు జరిపి రోడ్డుపై ఉన్నవారిని, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవారిని ఆందోళనకు గురిచేశాడు. తద్వారా వారికి అక్కడి నుంచి వెళ్లిపోయే మార్గం సులువైంది. 

Also Read: బెదిరించాలనే వెళ్తే.. చంపుకునేంత వరకు వెళ్లింది: బెజవాడ గ్యాంగ్‌వార్‌కు కారణం ఆ ‘‘ ఒక్కడే ’’

ఈ మర్డర్ జరిగిన తర్వాత దీనికి బాధ్యత వహిస్తూ ఓ పోస్టు ఫేస్‌బుక్‌లో దర్శనం ఇచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడిగా పేర్కొంటూ రోహిత్ గొదారా ఆ పోస్టు పెట్టాడు. ఆ ఘటనకు బాధ్యత తీసుకుంటూ పోస్టు చేశాడు. ఆనంద్‌ పాల్ సింగ్, బల్బీర్ బానుదాలకు ప్రతీకారంగా రాజు తేట్‌ను హత్య చేసినట్టు పేర్కొన్నాడు.

ఆనంద్‌పాల్ గ్యాంగ్ సభ్యుడే బల్బీర్ బానుదా. ఈ బల్బీర్ బానుదాను 2014 జులైలో బికనీర్ జైలులో జరిగిన గ్యాంగ్ వార్‌లో చంపేశారు. 

రాజు తేట్ మద్దతుదారులు వెంటనే సికార్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios