Asianet News TeluguAsianet News Telugu

 తెలుగు IAS కృష్ణయ్య హత్య కేసులో గ్యాంగ్‌‌స్టర్ విడుదల.. కోర్టును ఆశ్రయించిన  దళిత సంఘాలు

దళిత ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మాజీ కలెక్టర్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన గ్యాంగ్‌స్టర్‌,రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  కోర్టును ఆశ్రయించాయి. 

Gangster released in Telugu IAS Krishnaiah murder case.. Challenging the Government's orders krj
Author
First Published Apr 27, 2023, 9:25 AM IST

గ్యాంగ్ స్టార్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విషయంలో బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. . జైలు మాన్యువల్‌లో సవరణలను ఆరోపిస్తూ మాజీ ఎంపీ, జీవిత ఖైదీ ఆనంద్ మోహన్‌తో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ బీహార్ ఇన్‌చార్జి అమర్ జ్యోతి బుధవారం పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన హైకోర్టులో పిల్ దాఖాలు చేశారు.  నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర జైలు మాన్యువల్‌ను నేరస్థులకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు. బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.

1994లో బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను జైలు నుంచి విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

నివేదికల ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ చోటాన్ శుక్లా అంత్యక్రియల ఊరేగింపులో ఐఏఎస్ అధికారి కృష్ణయ్య  కారుపై దాడి చేయడంతో ఆయన మరణించాడు. ఈ హత్య వెనుక సూత్రధారి ఆనంద్ మోహన్ నేననీ,  ఊరేగింపు సమయంలో గ్యాంగ్‌స్టర్ చోటాన్ శుక్లా మద్దతుదారులను రెచ్చగొట్టారనీ, దీంతో వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ మేరుకు ఆనంద్ మోహన్ పై ఛార్జిషీట్ వేశారు. 

ఈ పరిణామంపై ఐఏఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య స్పందిస్తూ.. బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఈ పరిణామం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. బీహార్‌లో కుల రాజకీయాలు అటువంటి నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన పరిశీలిస్తే అర్థమవుతుందనీ, ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ ఓట్లను ఆకర్షించేందుకు నితీష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కూడా ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల వ్యతిరేకించింది. బీహార్ ప్రభుత్వ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios