కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో మిగిలిన నేరస్తులు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు తమ స్థావరాలను మార్చేస్తున్నారు.
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో మిగిలిన నేరస్తులు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు తమ స్థావరాలను మార్చేస్తున్నారు. కొందరు పోలీసులకు దూరంగా వుండేందుకు తమ రాష్ట్రాలను సైతం దాటిపోతున్నారు.
కనీసం తమ నీడను కూడా నమ్మడం లేదట. అనుచరులను సైతం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారట. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ కాపాడండి.. మహాప్రభో అంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించాడు.
తనను పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఛండీగఢ్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఛండీగఢ్ జైల్లో వున్న ఆయన నేరాలపై విచారణ జరుగుతోంది.
తనను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేసే ప్రమాదం వుందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పంజాబ్, రాజస్థాన్‌లో చాలా నేరాలకు పాల్పడిన లారెన్స్.. తనను కోర్టుకు తెచ్చేటప్పుడైనా, ఎక్కడకు వెళ్లేప్పుడైనా బేడీలు వేయాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు.
తద్వారా తనను ఎన్‌కౌంటర్ చేసే అవకాశాలు తగ్గుతాయని లారెన్స్ అభిప్రాయం. మరి అతనికి కోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచి చూడాలి. కాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడ్డ వికాస్ దూబేని ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసు ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది.
దీనిని అదునుగా చేసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో తీవ్రగాయాల పాలైన వికాస్ దూబేను కాన్పూర్ ఆసుపత్రికి తరలించగా అతను మరణించాడు. వికాస్ దూబేపై పలు హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్ అభియోగాలున్నాయి.
